
తాజా వార్తలు
బెంగళూరు: భారత్ ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన ‘చంద్రయాన్-2’ అత్యంత విజయవంతంగా తన లక్ష్యం వైపు దూసుకెళ్తోంది. నిన్న కీలక ఘట్టం విజయవంతంగా పూర్తయిన విషయం తెలిసిందే. ఈ వ్యోమనౌకలోని ఆర్బిటర్ నుంచి ‘విక్రమ్’ ల్యాండర్ నిన్న మధ్యాహ్నం 1:15కు విడిపోయింది. కాగా ఇస్రో నేడు మరో ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. విక్రమ్ ల్యాండర్‌కు చెందిన తొలి కక్ష్యను మంగళవారం ఉదయం 8.05 నిమిషాలకు తగ్గించింది. ఇందు కోసం తొలిసారిగా విక్రమ్ ప్రపొల్షన్ సిస్టమ్‌ను వినియోగించి.. ఈ ప్రక్రియను 4 సెకన్లలో పూర్తిచేశారు. దీంతో విక్రమ్ ప్రస్తుతం 104కి.మీX128కి.మీ కక్ష్యలోకి చేరింది. రేపు మరోసారి కక్ష్య తగ్గింపు ప్రక్రియను చేపట్టనున్నారు.
జులై 22న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-2 కొద్దిరోజుల పాటు భూ కక్ష్యలో పరిభ్రమించి, ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ నెల 7న అంతిమ ఘట్టం చోటుచేసుకుంటుంది. ఆ రోజున ల్యాండర్‌లోని ‘పవర్ డిసెంట్’ దశ ఆరంభమవుతుంది. ఆ వ్యోమనౌకలోని రాకెట్లను మండించడం ద్వారా దాన్ని కిందకు దించుతారు. ఆ తర్వాత 15 నిమిషాల్లో ల్యాండర్.. చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రాంతంలో దిగుతుంది. నాలుగు గంటల తర్వాత అందులోని రోవర్ బయటకు వస్తుంది.
రాజకీయం
జనరల్
ఛాంపియన్
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- కిర్రాక్ కోహ్లి
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- తీర్పు చెప్పిన తూటా
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- హక్కులు మనుషులకు.. మృగాళ్లకు కాదు!
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
- రజాక్‌కు పఠాన్ చురకలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)

దేవతార్చన

శ్రీ మహాలక్ష్మికి సువర్ణాలయం
బంగారం... స్తంభాలు బంగారం... వాటిపై శిల్పకళ బంగారం.. గోపురం విమానం, అర్ధమంటపం శఠగోపం... అన్నీ బంగారంతో చేసినవే. అంటే స్వర్ణదేవాలయం! అమృత్సర్ స్వర్ణదేవాయంలో కూడా మంటపాలూ, గోపురాలూ ఇవన్నీ ఉండవే అనుకుంటున్నారా... మీ సందేహం నిజమే, ఇది అమృత్సర్ గురుద్వారా కాదు,