close

తాజా వార్తలు

నోటీస్ బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

సికింద్రాబాద్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం... ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులకు నియామక ర్యాలీ నిర్వహిస్తోంది. రాష్ట్రానికి చెందిన 13 జిల్లాలవారు దీనికి అర్హులు.

* ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ (తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం)

సోల్జర్‌ ఫార్మా అర్హత: ఇంటర్మీడియట్‌, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

వయసు: అక్టోబర్‌ 1, 2019 నాటికి 19-25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌, రాతపరీక్ష ఆధారంగా.

ర్యాలీ నిర్వహణ తేది: అక్టోబరు 7 నుంచి 17 వరకు.

ర్యాలీ ప్రదేశం: డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ స్టేడియం, కరీంనగర్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: సెప్టెంబరు 22.

వెబ్‌సైట్‌: http://www.joinindianarmy.nic.in/

ఎంఈసీఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

నాగ్‌పూర్‌లోని మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ కార్పొరేషన్‌(ఎంఈసీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

మొత్తం ఖాళీలు: 88

పోస్టులు: డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, మెకానికల్‌ ఇంజినీర్‌, జియాలజిస్ట్‌, తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: సెప్టెంబరు 21

వెబ్‌సైట్‌: https://www.mecl.co.in/

అప్రెంటిస్‌షిప్  

నావల్‌ డాక్‌యార్డ్‌, ముంబయి

* ముంబయిలోని నావల్‌ డాక్‌యార్డ్‌ కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* అప్రెంటిస్‌ (డిజిగ్నేటెడ్‌, నాన్‌ డిజిగ్నేటెడ్‌ ట్రేడులు)

మొత్తం ఖాళీలు: 1233

ట్రేడులు: బాయిలర్‌ మేకర్‌, గ్యాస్‌ టర్బైన్‌ ఫిట్టర్‌, మెషినరీ కంట్రోల్‌ ఫిట్టర్‌, మెషినిస్టు, వెల్డర్‌, షీట్‌ మెటల్‌ వర్కర్‌, మెకానిక్‌ డీజిల్‌, తదితరాలు.

అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 1 ఏప్రిల్‌, 1999 - 31 మార్చి 2006 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ/ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: సెప్టెంబరు 20

వెబ్‌సైట్‌: http://www.bhartiseva.com/

వాక్‌ - ఇన్స్‌

సీఐఎంఎఫ్‌ఆర్‌, నాగ్‌పుర్‌

* నాగ్‌పుర్‌లోని సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైనింగ్‌ అండ్‌ ఫ్యూయల్‌ రిసెర్చ్‌(సీఐఎంఎఫ్‌ఆర్‌).. తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ మొత్తం ఖాళీలు: 53

విభాగాలు: కెమిస్ట్రీ, జియాలజీ, మెకానికల్‌, మైనింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వాక్‌ఇన్‌ తేది: సెప్టెంబర్‌ 17-20 వేదిక: సీఎస్‌ఐఆర్‌-సీఐఎంఎఫ్‌ఆర్‌, సీఐఎంఎఫ్‌ఆర్‌ రిసెర్చ్‌ సెంటర్‌, సివిల్‌ లైన్‌, నాగ్‌పుర్‌ -440001.

వెబ్‌సైట్‌: http://cimfr.nic.in/

సీఎస్‌ఐఓలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

* చండీగఢ్‌లోని సెంట్రల్‌ సైంటిఫిక్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ఆర్గనైజేషన్‌ (సీఎస్‌ఐఓ)..తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ మొత్తం ఖాళీలు: 21

విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌, ఇనుస్ట్రుమెంటేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, మెకానికల్‌, మెకట్రానిక్స్‌, బయో మెడికల్‌, తదితరాలు.

అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, గేట్‌/ యూజీసీ-నెట్‌ ఉత్తీర్ణత. వాక్‌ఇన్‌ తేది: సెప్టెంబర్‌ 5.

వేదిక: ఐఎస్‌టీసీ ఆడిటోరియం, సీఎస్‌ఐఆర్‌-సీఎస్‌ఐఓ, సెస్టర్‌-30సీ, చండీగఢ్‌.

వెబ్‌సైట్‌: https://www.csio.res.in/

* మరిన్ని నోటిఫికేషన్లు www.eenadupratibha.net లో.



 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.