close

తాజా వార్తలు

సిల్కు దుస్తులు మన్నేలా...

సిల్కు దుస్తులు ఉతుకుతున్నారా... ఈ జాగ్రత్తలు తీసుకుంటే అవి ఎక్కువకాలం మన్నుతాయి.

* గోరువెచ్చని నీటితోనే సిల్కు దుస్తుల్ని ఉతకాలి. ఒకవేళ వాటిపై డ్రైక్లీన్‌ అని రాసి ఉంటే ఆ పద్ధతిని ఎంచుకోవాలి.
* ఈ దుస్తుల్ని ఉతికేందుకు గాఢత తక్కువగా ఉన్న డిటర్జెంట్‌ ఎంచుకోవాలి. బ్లీచ్‌ వాడకపోవడమే మంచిది.
* ముదురు రంగు దుస్తులు ఉతికేముందు ఓ పని చేయండి. చీర లేదా డ్రెస్‌ అంచును... కొద్దిగా ఉతికి చూడండి. రంగు పోతోందనుకుంటే.. డ్రైక్లీనింగ్‌ చేయించడమే మంచిది.
* వెడల్పాటి టబ్బు నిండా గోరువెచ్చని నీటిని నింపాలి. అందులో చాలా కొద్దిగా డిటర్జెంట్‌/గాఢత తక్కువగా ఉండే షాంపూ/ బాడీవాష్‌... ఇలా ఏదో ఒకటి వేసి, దుస్తుల్ని నానబెట్టాలి. ఐదు నిమిషాల తరువాత ఆ నీటిని వంపేసి చల్లని నీరు, కప్పు వెనిగర్‌ వేయాలి. దుస్తులకు అంటుకున్న సబ్బు పోతుంది. ఇలా చేస్తే అవి ఎక్కువకాలం మన్నుతాయి.
* వాటిపై మరక పడిన వెంటనే... నిమ్మరసం, వెనిగర్‌ కలిపి రాసి ఐదు నిమిషాల తరువాత ఉతికి చూడండి. అప్పటికీ పోకపోతే డ్రైక్లీనింగ్‌ చేయించండి.
* ఒకవేళ వాషింగ్‌ మెషీన్‌లో వీటిని ఉతుకుతోంటే... తక్కువ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. డ్రైయ్యర్‌లో దుస్తులు ఆరబెట్టకూడదు. అప్పుడే మడతలు పడకుండా ఉంటాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.