
తాజా వార్తలు
గ్యాడ్జెట్ గురూ
దేంట్లోనైనా గ్యాడ్జెట్ల సాయం అనివార్యం అయిపోయింది. తోటి మనిషితో మాట్లాడినట్టుగానే మాట కలిపేస్తున్నాం. రోజంతా స్మార్ట్‌గా గడిపేస్తున్నాం. అందుకు తగిన వాయిస్ అసిస్టెంట్ ఉత్పత్తులు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. లెనోవా కొత్తగా రెండు ఉత్పత్తుల్ని ప్రవేశపెట్టింది. ఒకటి స్మార్ట్ డిస్ప్లే, ఇంకొకటి స్మార్ట్ క్లాక్. రెండూ గూగుల్ అసిస్టెంట్ సపోర్టుతో పని చేస్తాయి.
స్మార్ట్ సహచరి..
శుభోదయంతో మొదలు.. రాత్రి నిద్రించే వరకూ మీకు సంబంధించిన అన్ని పనుల్లోనూ చేదోడువాదోడుగా ఉండేదే ఈ ‘స్మార్ట్ డిస్ప్లే’. మంచం దిగకుండానే ఆ రోజు షెడ్యూల్స్ వివరాల్ని అడిగి తెలుసుకోవచ్ఛు ఏదైనా కొత్త వంటకాన్ని చేద్దాం అనుకుని ‘హే గూగుల్... ’ అని అడిగితే వంటకానికి కావాల్సినవి, ఎలా తయారు చేయాలో ప్లే చేసి చూపిస్తుంది. ఫోన్‌ని ముట్టకుండానే కాల్స్ మాట్లాడొచ్ఛు మెసేజ్‌లకు రిప్లై ఇవ్వొచ్ఛు ఇంట్లోని స్మార్ట్ పరికరాల్ని దీంతోనే కంట్రోల్ చేయొచ్ఛు టీవీ ఆన్ చెయ్.. లైట్ ఆఫ్ చెయ్.. అని చెబితే చాలు. ఆన్, ఆఫ్ అయిపోతాయి. ఆహ్లాదకరమైన మ్యూజిక్‌ని ప్లే చేయమని చెబితే, క్షణాల్లో మీకు ఇష్టమైన పాటల్ని వినిపిస్తుంది. స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే.. 8, 10 అంగుళాల తాకే తెరలతో ‘స్మార్ట్ డిస్ప్లే’ని ఎంపిక చేసుకోవచ్ఛు వీడియో ఛాటింగ్‌కి 5 ఎంపీ ముందు కెమెరా ఉంది. రెండు మైక్రోఫోన్లు ఉన్నాయి.
స్మార్ట్ అలారం..
చిన్నప్పటి నుంచి అలారం వాడుతూనే ఉండొచ్చు కానీ.. ఈ స్మార్ట్ క్లాక్‌ని వాడి ఉండరు. సాధారణ అలారంలా నిద్ర లేపడం మొదలు అన్ని పనుల్లోనూ మీకు సాయం చేస్తుంది. గూగుల్ అసిస్టెంట్ సపోర్టుతో అడిగినవన్నీ క్షణాల్లో చేసేస్తుంది. రోజువారీ పనులు, సమావేశాల వివరాలు చెబుతుంది. ఇంట్లోని అన్ని స్మార్ట్ వస్తువుల్ని వాయిస్ కమాండ్స్‌తో కంట్రోల్ చేయొచ్ఛు మీకు ఇష్టమైన ట్రాక్స్‌ని అడిగితే ప్లే చేస్తుంది. గదిలో వెలుతురుకి తగ్గట్టుగా ఉదయం ఫుల్ బ్రైట్‌నెస్‌తో మొదలై రాత్రి అయ్యేసరికి తక్కువ బ్రైట్నెస్కి మారిపోతుంది. తెర పరిమాణం 4 అంగుళాలు. 1జీబీ ర్యామ్.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
