
తాజా వార్తలు
దిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. ఈ మేరకు కేంద్రం ప్రకటించింది. సినీరంగంలో విశేషసేవలు అందించినందుకు గానూ అమితాబ్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ ట్వీట్ చేశారు. సినీరంగంలో బిగ్‌బీగా పేరు తెచ్చుకున్నారు. బాలీవుడ్లో తనదైన ముద్రవేసిన అమితాబ్ బచ్చన్.. హిందీ సహా అనేక భాషల్లో నటించారు. ఆయన నటనకు గాను 2015లో పద్మవిభూషణ్ వరించింది. ఆనంద్, జింజీర్, షోలే, దీవార్, డాన్, కూలీ, అగ్నిపథ్, బ్లాక్, పా, పీకూ తదితర చిత్రాల్లో అద్భుతమైన నటనతో అలరించారు. తన 60 ఏళ్ల సినీ ప్రస్థానంలో సుమారు 200కు పైగా చిత్రాల్లో నటించారు. అమితాబ్ నటించిన ‘బద్లా’ చిత్రం ఈ ఏడాది విడుదలైన విషయం తెలిసిందే. చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కిన ‘సైరా’లో అమితాబ్.. గోసాయి వెంకన్న పాత్రలో అలరించనున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
బిగ్ బీకి కంగ్రాట్స్: జావడేకర్
అమితాబ్ బచ్చన్ తన నటనతో రెండు తరాలను అలరించడంతో పాటు స్ఫూర్తిగా నిలిచారని జావడేకర్ కొనియాడారు. అలాంటి వ్యక్తి ఈ అత్యున్నత పురస్కారానికి ఏకగ్రీవంగా ఎంపిక కావడాన్ని యావత్ భారతదేశమే కాదు.. ప్రపంచమంతా హర్షిస్తుందన్నారు. అమితాబ్‌కు తన హృదయపూర్వకం శుభాకాంక్షలు తెలుపుతూ జావడేకర్ ట్వీట్ చేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- నాకు సంబంధం ఉందని తేలితే ఉరేసుకుంటా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
