close

తాజా వార్తలు

మోదీ-అమిత్‌ షా భేటీ

భాజపా-సేన సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చే అవకాశం

దిల్లీ: మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భాజపా అభ్యర్థులను ఖరారు చేసేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా ఆదివారం భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల పార్టీ అధికారులతో దిల్లీలోని భాజపా కార్యాలయంలో సమావేశమైనట్లు ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే, మహారాష్ట్రలో శివసేనతో సీట్ల సర్దుబాటుపై ఆదివారమే ఓ స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు మహారాష్ట్రలోని 288 సీట్లలో భాజపా 144, శివసేన 126 స్థానాల్లో పోటీ చేస్తాయని, మిగతా 18 స్థానాలు చిన్న పార్టీలకు కేటాయిస్తాయని వెల్లడించారు. శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.