close

తాజా వార్తలు

మా పింఛను ఉద్యోగులకివ్వండి

అరుణ్‌ జైట్లీ కుటుంబం దాతృత్వం

దిల్లీ: దివంగత కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ కుటుంబం దాతృత్వం చూపింది. పింఛను తీసుకోవడానికి నిరాకరించింది. తమ కుటుంబానికి ఇచ్చే పింఛను డబ్బులను రాజ్యసభలోని నాలుగో తరగతి సిబ్బందికి ఇవ్వాల్సిందిగా జైట్లీ భార్య సంగీతా జైట్లీ సోమవారం రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ రాశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధిపడిన జైట్లీ ఆగస్టు 24న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన ఎంపీగా ఉన్న సమయంలో రాజ్యసభలో ఉన్న సిబ్బంది సమస్యలను కళ్లారా చూశారని లేఖలో సంగీతా పేర్కొన్నారు. 

పార్లమెంట్‌ సభ్యుల చట్టం ప్రకారం.. మాజీ ఎంపీలకు రూ.20 వేలు కనీస పింఛనుగా ఇవ్వాలి. వీటితో పాటు మరో రూ.1500 అదనపు భత్యం కింద ఇస్తారు. అరుణ్‌ జైట్లీ 1999 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇందుకు గానూ ఆయనకు నెలకు అదనంగా మరో రూ.22,500 పింఛనుగా వస్తోంది. మొత్తంగా ఆయనకు దాదాపుగా రూ.50వేలు పింఛను రూపేణా ఇస్తున్నారు. అయితే మాజీ ఎంపీలకిచ్చే పింఛనులో సగం మొత్తాన్ని కుటుంసభ్యుల్లో భార్య/భర్తకు లేదా వారి మీద ఆధారపడిన వారికి ఇస్తారు. ఈ రకంగా జైట్లీ కుటుంబానికి నెలకు రూ. 25వేలు చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని జైట్లీ కుటుంబం తిరస్కరించింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.