close

తాజా వార్తలు

ఆ తరహా రాజకీయాలు తగ్గించాం..

దిల్లీ: మహారాష్ట్రను కులతత్వం నుంచి జాతీయవాదం వైపు మళ్లించడంలో భాజపా విజయం సాధించిందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు వినయ్‌ సహస్రబుద్దే అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ‘మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ చేసిన సేవలు కూడా కూడా అందుకు అనుకూలంగా పని చేశాయి. గతంలో ఎప్పటి నుంచో రాష్ట్ర రాజకీయాలు కులాల గుర్తింపుతో ముడిపడ్డాయి. కానీ గత ఐదు సంవత్సరాల్లో ఆ తరహా గుర్తింపు రాజకీయాలు తగ్గించడంలో భాజపా ప్రభుత్వం విజయం సాధించింది. వాటిని తగ్గించడంతో పాటు భాజపా జాతీయవాదం వైపు మళ్లించిందని చెప్పారు. అదే పార్టీని రాష్ట్రంలో బలంగా మార్చింది’ అని అభిప్రాయపడ్డారు. 

‘కొన్ని అగ్రవర్ణ కులాల పేరుతో ప్రతిపక్షాలు భాజపాను విమర్శిస్తున్నాయి. ఆ విషయానికి వస్తే మేము వారి కన్నా కొంత మంచి స్థితిలోనే ఉన్నాం. ఫడణవీస్‌ కేవలం ఒక్క నియోజకవర్గంపైనే దృష్టి సాధించకుండా రాష్ట్రం మొత్తం సమానంగా అభివృద్ధి చేశారు. అదేవిధంగా మరాఠా ప్రజలకు రిజర్వేషన్లు వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఐదేళ్లలో ఫడణవీస్‌ కులంతో సంబంధం లేని నాయకుడిగా ఎదిగారు’ అని అన్నారు. అదేవిధంగా ఆయన శివసేన, భాజపా కూటమి గురించి ప్రస్తావిస్తూ.. ఒకే రకమైన భావజాలం ఉన్న పార్టీలు కావడంతో ఈ రెండు పార్టీలది సాధారణ పొత్తే అని చెప్పారు. గత ఎన్నికల్లో లాగా కాకుండా ఈ సారి భాజపా, శివసేన కలిసే పోటీ చేస్తాయని పేర్కొన్నారు. ఈ రెండు పార్టీల కూటమికే అత్యధిక మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఎన్నికలు అక్టోబర్‌ 21న జరగనున్న విషయం తెలిసిందే. అనంతరం అక్టోబర్‌ 24న ఫలితాలు వెలువడనున్నాయి. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.