close

తాజా వార్తలు

జాతీయ అంశాలే భాజపా ఎజెండా

దిల్లీ: సార్వత్రిక సమరంలో రెండోసారి విజయంతో ఊపు మీదున్న భాజపా తొలిసారి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే అధికారంలో ఉన్న ఆ పార్టీ.. తిరిగి అధికారం నిలబెట్టుకుని సత్తాచాటాలని చూస్తోంది. త్వరలో జరగబోయే మరిన్ని రాష్ట్రాల్లో సైతం గెలుపు తమదేనన్న సంకేతం ఇవ్వాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ అంశాలను ఎజెండాగా ముందుకెళ్లాలని ఆ పార్టీ భావిస్తోంది.

మహారాష్ట్ర, హరియాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ అస్త్రాలను ఇప్పటికే సిద్ధం చేసింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ ఈ రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. మహారాష్ట్రలో 10, హరియాణాలో నాలుగైదు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమిత్ షా సైతం రెండు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. వీరి ప్రచారాంశాల్లో ఆర్టికల్‌ 370, అవినీతి రహిత పాలన, దేశవ్యాప్త ఎన్నార్సీ అమలు వంటివి ఉండునున్నాయని తెలుస్తోంది.

ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో ఇదే అంశాన్ని ప్రచారాస్త్రంగా ఉపయోగించుకోవాలని భాజపా భావిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేతలు సైతం ఆర్టికల్‌ 370 రద్దును సమర్థించడాన్ని వాడుకుని ఆ పార్టీని ఇరుకునపెట్టాలని భావిస్తోంది. ప్రతిపక్ష పార్టీ నేతలపై ఉన్న అవినీతి ఆరోపణలపైనా విమర్శలను ఎక్కుపెట్టనుంది. అదే సమయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడణవీస్, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు ఉన్న మచ్చలేని పాలన, నిజాయతీని సైతం ప్రచారంలో ఉపయోగించుకోనుంది. ఈ ఎజెండాతో మహారాష్ట్రలో శివసేనతో కలిసి 220 స్థానాలకు పైగా, హరియాణాలో 75 స్థానాలకు పైగా సాధిస్తామని భాజపా ధీమా వ్యక్తంచేస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో విజయం.. త్వరలో జరగబోయే ఝార్ఖండ్‌, దిల్లీ ఎన్నికలకు లాభిస్తుందని ఆ పార్టీ భావిస్తోంది.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.