
తాజా వార్తలు
ముంబయి: బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ ‘దబాంగ్ 3’ సెట్లో భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. సోనాక్షి సిన్హా కథానాయిక. సక్సెస్ఫుల్ సిరీస్ ‘దబాంగ్’ సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. చివరి రోజు సెట్లో తీసుకున్న వీడియోను సల్మాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆదివారంతో చిత్రీకరణ ముగిసిందని, ఈ రోజు దివంగత నటుడు వినోద్ ఖన్నా పుట్టినరోజని గుర్తు చేసుకున్నారు. షూటింగ్లో వినోద్ ఖన్నాను మిస్ అయ్యామని భావోద్వేగానికి గురయ్యారు. ‘దబాంగ్’లో సల్మాన్ తండ్రిగా వినోద్ ఖన్నా నటించారు. ఈ నేపథ్యంలో సల్లూభాయ్ ఆయన్ను గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ‘దబాంగ్ 3’లో సల్మాన్ తండ్రి పాత్రను వినోద్ ఖన్నా సోదరుడు ప్రమోద్ పోషిస్తున్నారు.
కన్నడ స్టార్ సుదీప్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. డిసెంబరు 20న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు సల్మాన్ ఇప్పటికే ప్రకటించారు. మరోపక్క ‘ఏక్తా టైగర్ 3’ సినిమాలోనూ ఆయన నటించబోతున్నారు. ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్, ప్రభుదేవా సంయుక్తంగా దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. సల్లూభాయ్ ఇటీవల ‘భారత్’తో మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- పెళ్లే సర్వం, స్వర్గం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
