close

తాజా వార్తలు

‘గూగుల్‌ పిక్సెల్‌ 4’ సిరీస్‌ ఇలా ఉండబోతోందా?

పిక్సెల్‌  4 సిరీస్‌లో పిక్సెల్‌ 4, పిక్సెల్‌ 4 ఎక్స్‌ఎల్‌ను లాంచ్‌ చేయడానికి గూగుల్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 15న న్యూయార్క్‌లో దీని కోసం భారీ హార్డ్‌ వేర్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా గూగుల్‌ కూడా పిక్సెల్‌ 4 గురించి టీజ్‌ చేస్తూ వస్తోంది. ఈ ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్స్‌ మొబైల్‌లో ఆసక్తికరమైన ఫీచర్లు ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్నింటిని గూగుల్‌ చెప్పగా, మరికొన్ని లీకుల రూపంలో బయటకు వచ్చాయి. వాటిప్రకారం చూస్తే పిక్సెల్‌ 4 సిరీస్‌ మొబైల్‌ లో ఈ ఫీచర్స్‌ ఉండొచ్చు. ఈ మొబైల్స్‌ ధర గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేనప్పటికీ... పిక్సెల్‌ 4 సిరీస్‌లో ప్రత్యేకంగా ‘ఆరెంజ్‌ వేరియంట్‌’ను తీసుకొస్తున్నారని తెలుస్తోంది. ఇది ఐఫోన్‌ 11 కంటే ఎక్కువ ధర ఉంటుందని సమాచారం. 

పిక్సెల్‌ 4 సిరీస్‌ మొబైల్స్‌లో ‘సోలి’ అనే మోషన్‌ సెన్సింగ్‌ రాడార్‌ ఫీచర్‌ తీసుకొస్తున్నారని ఇప్పటికే తెలిసింది. దీనికి సంబంధించి గూగుల్‌ ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఆ వీడియో ప్రకారం చూస్తే సైగల ద్వారా పాటల ట్రాక్‌ను మార్చడం, అలారం ఆపడం, కాల్స్‌ను సైలెంట్‌ చేయడం లాంటి పనులు చేయొచ్చు. ఇప్పుడు ఈ మోషన్‌ సెన్సింగ్‌ గురించి మరికొన్ని విషయాలు బయటికొచ్చాయి. దీని ద్వారా ఫేస్‌ అన్‌లాక్‌ ఆప్షన్‌ను కూడా తీసుకొస్తున్నారట. ఈ లెక్కన కొత్త పిక్సెల్‌ మొబైల్స్‌లో ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉండదని తెలుస్తోంది. 

పిక్సెల్‌ 4 సిరీస్‌ మొబైల్స్‌ లో ‘పిక్సెల్‌ న్యూరల్‌ కోర్’ అనే సాంకేతికతను తీసుకొస్తున్నారట. పిక్సెల్‌ 3లో క్లాస్‌ లీడింగ్‌ కెమెరాకు ఇది అప్‌డేటెడ్‌ వెర్షన్‌ అంటున్నారు. దీని వల్ల ఈ మొబైల్స్‌లో ఫొటోలు మరింత ఆకర్షణీయంగా వస్తాయట.  దీంతోపాటు ఈ మొబైల్స్‌లో ట్రాన్స్‌క్రిప్షన్‌ సెంట్రిక్‌ రికార్డింగ్‌ యాప్‌ను తీసుకొస్తున్నారు. దీని ద్వారా కార్‌ క్రాషెస్‌ను సులభంగా డిటెక్ట్‌ చేయొచ్చు.  ఈ మొబైల్‌ ఉన్న వ్యక్తి లేదా వాహనం క్రాష్‌ అయితే డిటెక్ట్‌ చేసి సమాచారం చేరవేస్తుంది. ఆపిల్‌ వాచ్‌లో ఈ తరహా ఫీచర్‌ ఇప్పటికే ఉంది. పిక్సెల్‌ 4 సిరీస్‌లో 5జీ వెర్షన్‌ను కూడా తీసుకొస్తారని తెలుస్తోంది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.