close

తాజా వార్తలు

అపురూపమైన ఫొటోలు షేర్‌ చేసిన ప్రియాంకా గాంధీ

వినూత్నంగా రాహుల్‌ గాంధీకి శుభాకాంక్షలు 

దిల్లీ: ప్రియాంక సోషల్‌మీడియా వేదికగా అన్న రాహుల్‌ మీద తనకున్న ప్రేమను వ్యక్తం చేశారు. ‘భాయి దూజ్‌(భగినీ హస్తాన్న భోజనం) సందర్భంగా వారిద్దరికి సంబంధించిన ఫొటోను ట్వీట్‌ చేశారు. ‘‘భాయి దూజ్‌ సందర్భంగా లవ్యూ రాహుల్‌గాంధీ’ అని ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా తమ చిన్ననాటి ఫొటోలు, అమ్మానాన్నలు సోనియా, రాజీవ్‌ గాంధీతో గడిపిన ఫొటో, నానమ్మ ఇందిరా గాంధీతో ఉన్న ఫొటోలతో పాటు పలు సందర్భాల్లో వీరిద్దరూ తీసుకున్న వాటిని కొల్లాజ్‌ చేసి షేర్‌ చేశారు. ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే దీన్ని 30వేల మందికి పైగా లైక్‌ చేశారు. దీపావళి పండుగ పూర్తయిన రెండు రోజుల తర్వాత ‘భాయి దూజ్‌’ను జరుపుకొంటారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.