
తాజా వార్తలు
సోహా అలీఖాన్ తనయ గాయత్రి మంత్రాన్ని ఎలా చెప్పిందో చూడండి
ముంబయి: ‘పిల్లలు..దేవుడు చల్లని వారే..కల్లకపటమెరుగని కరుణామయులే’ అన్నాడో సినీకవి. పాటే అయినా ఇది అక్షర సత్యం. చిన్నారుల పలుకుల్లో, హావభావాల్లో కల్మషం ఉండదు. మరి అలాంటి స్వచ్ఛమైన మాటలతో కీర్తిస్తే దేవతలే మురిసిపోతారు. అలా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మేనకోడలు, సోహా అలీఖాన్, కునాల్ కెముల గారాల పట్టి ఇనాయా నమీ కెము గాయత్రి మంత్రాన్ని ఎంతో ముద్దుగా పలికింది. నిన్న ‘భాయి దూజ్’ సందర్భంగా కునాల్ సోదరి ఈ మంత్రాన్ని పఠించింది. తర్వాత ఇనాయాను కూడా చెప్పమని అడిగింది. దీంతో ఇనాయా చెప్పడం మొదలు పెట్టింది. చిన్నారి గాయత్రి మంత్రాన్ని క్యూట్‌గా చెప్పడం ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను కునాల్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీంతో వైరల్ అవుతోంది. నెటిజన్లతో పాటు బాలీవుడ్ ప్రముఖులు సైతం ఇనాయాను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- 8 మంది.. 8 గంటలు
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
