
తాజా వార్తలు
చండీగఢ్: కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూను పాకిస్థాన్ ఆహ్వానించింది. నవంబరు 9న పాక్ భూభాగంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ కారిడార్‌ను ప్రారంభించనున్నారు. గతంలో సిద్ధూ పాక్ ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళ్లి తీవ్ర విమర్శలపాలైన సంగతి తెలిసిందే. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరై, అక్కడ ఆ దేశ ఆర్మీ చీఫ్ బజ్వాను ఆలింగనం చేసుకున్నారు. ఈ ఘటనతో భాజపా నుంచే కాక సొంత పార్టీ నుంచి కూడా సిద్ధూ వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పాక్ తాజా ఆహ్వానం మేరకు సిద్ధూ ఎలా స్పందిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది.
కర్తార్‌పూర్ కారిడార్ గుండా పాక్‌లోని గురుద్వారా సాహిబ్‌కు వెళ్లే యాత్రికుల తొలి జాబితాను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఇందులో భాగంగా 575 మంది వెళ్లనున్నారు. వీరిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, కేంద్ర మంత్రి హర్దీప్ పూరీ, హర్సిమ్రత్ కౌర్ బాదల్, పంజాబ్‌కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండనున్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- నాకు సంబంధం ఉందని తేలితే ఉరేసుకుంటా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
