
తాజా వార్తలు
ప్రశ్న: ప్లాస్టిక్ వేడికి ఎందుకు కరిగిపోతుంది?
- పి. యశ్వంత్, నాగారం
ప్లాస్టిక్ తయారీకి ముడి పదార్థాలు... కార్బన్, హైడ్రోజన్లు. ఇవి సరళంగా సంఘటితమైతే మోనోమర్స్(ఏకాణువులు)గా తయారవుతాయి.
* సమూహాలుగా సంఘటితమైతే పాలిమర్స్‌గా తయారవుతాయి.
* గుణాలను బట్టి ప్లాస్టిక్లు రెండు రకాలు. ఒక రకం థర్మోప్లాస్టిక్లు. ఇవి వేడికి కరిగిపోతాయి. చల్లబడిన తర్వాత గట్టిపడతాయి. అందుకనే కావాల్సిన అచ్చులో పోసి వస్తువులు తయారు చేస్తారు.
* రెండో రకం థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. ఇవి బంకలా ఉన్నప్పుడే పోత పోయడానికి అనుకూలంగా ఉంటాయి. ఎక్కువ వేడి చేస్తే గట్టిపడి బిగుసుకుపోతాయి. తర్వాత వేడిగాని, చలిగాని వీటిని మార్చలేదు.
* ప్లాస్టిక్‌ను వేడి చేసినప్పుడు అందులోని పాలిమర్ చైన్లు స్వేచ్ఛగా కదులుతాయి. దీంతో పదార్థం మృదువుగా తయారవుతుంది. ఈ పాలిమర్... కరిగే ఉష్ణోగ్రతకు వెళ్లేసరికి, సరఫరా చేస్తున్న ఉష్ణశక్తిలో కొంత భాగం అందులోని స్ఫటికాకృతి ప్రాంతాలను కరిగిస్తుంది.
* ఈ కరిగే ఉష్ణోగ్రతలు.. రకరకాల ప్లాస్టిక్‌లకు వేర్వేరుగా ఉంటాయి. సాధారణంగా మనం ఉపయోగించుకునే పాలీబ్యాగ్‌లు, స్ట్రాలు, మినరల్ వాటర్ బాటిల్స్ వంటి వాటి కరిగే ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్‌కు అటూ ఇటూగా ఉంటుంది. దీంతో ఈ ప్లాస్టిక్ వేడి చేయడం వల్ల కరిగిపోతుంది.
- డాక్టర్ సి.వి. సర్వేశ్వర శర్మ, ప్రెసిడెంట్, కోనసీమ సైన్స్ పరిషత్, అమలాపురం
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- 8 మంది.. 8 గంటలు
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
