
తాజా వార్తలు
రేవా: రైతుల నుంచి రుణాలు వసూలు చేయడానికి వచ్చే వారి చేతులు విరగ్గొట్టి, గొంతు కోసి చంపుతామంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు భాజపా ఎంపీ జనార్దన్ మిశ్రా. సోమవారం ‘కిసాన్ ఆక్రోశ్ ఆందోళన్’ సమావేశంలో రేవా ఎంపీ మిశ్రా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని ఆరోపించారు.
‘రైతులను ఇబ్బందులకు గురిచేయాలని లక్ష్యంగా పెట్టుకుని వారి నుంచి రుణాలు వసూలు చేయడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులు, పోలీసుల చేతులు విరగ్గొట్టి, గొంతు కోసి చంపుతాం. రైతుల పక్షాన భాజపా కార్యకర్తలు ఉండి పోరాడుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో విభజన, విధ్వంసక రాజకీయాలు చేస్తోంది’ అని మిశ్రా ధ్వజమెత్తారు.
Tags :