
తాజా వార్తలు
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు నెలరోజుల నుంచి సమ్మె చేస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోకపోవడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ విమర్శించారు. హైదరాబాద్ వచ్చిన గులాం నబీఆజాద్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల 50 వేల మంది కార్మికులు రోడ్డెక్కారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డునపడినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. హామీలిచ్చి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నాక వాటిని అమలు చేయడంలో వెనకడుగు వేయడం సరికాదని హితవు పలికారు.
ఎన్డీయే ప్రభుత్వంపై ఆజాద్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా దేశ యువత, రైతులు, పేదలకు ఎన్నో హామీలిచ్చి మాట తప్పారని విమర్శించారు. కేంద్రంలో భాజపా అధికారం చేపట్టినప్పటి నుంచి నిరుద్యోగ సమస్య తీవ్రమైందని ధ్వజమెత్తారు. ఆర్థిక మాంద్యం కారణంగా దేశాభివృద్ధిలో తిరోగమనం ప్రారంభమైందని ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్ వెళ్లాలంటే సుప్రీం కోర్టు అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్ 5 నుంచి 15వ తేదీ వరకు ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆజాద్ వివరించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- పెళ్లే సర్వం, స్వర్గం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
