ఇది అద్దమే కాదు..అంతకుమించి
close

తాజా వార్తలు

Published : 06/11/2019 00:14 IST

ఇది అద్దమే కాదు..అంతకుమించి

రోజూ అద్దం చూస్తాం. ఎలా ఉన్నామో అలానే చూపించడం మామూలు అద్దం చేసే పని. అదే ఈ స్మార్ట్‌ అద్దం అలా కాదు. మీ ముఖాన్ని రోజూ విశ్లేషిస్తుంది. నిన్నటికీ ఈ రోజుకీ ఉన్న తేడా ఏంటో చెబుతుంది. అందుకు తగినట్టుగా మేకప్‌ని సూచిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మీకో వ్యక్తిగత బ్యూటీషియన్‌గా పని చేస్తుంది. పేరు ‘హాయ్‌ మిర్రర్‌’. బిల్ట్‌ఇన్‌గా నిక్షిప్తం చేసిన కెమెరాతో ముఖాన్ని స్కాన్‌ చేసి విశ్లేషిస్తుంది. అందుకు తగిన సూచనల్ని తెలుపుతుంది. ముఖంపై వయసుతో పాటు వస్తున్న మార్పుల్ని వివరిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరిస్తుంది. ముఖంపై ఏర్పడే మచ్చలు, మొటిమల్ని గుర్తించి నివారణకు తగిన చిట్కాల్ని చెబుతుంది. అద్దం తాకేతెర పరిమాణం 17 అంగుళాలు. మునివేళ్లతో తాకుతూ అద్దాన్ని ఆపరేట్‌ చేయొచ్ఛు ప్రత్యేక యాప్‌ని ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుని అద్దం సేకరించిన వివరాల్ని యాక్సెస్‌ చేయొచ్ఛు అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌ సపోర్టు ఉంది. అద్దం ముందు కూర్చుని మాట్లాడుతూ ఎలా మేకప్‌ చేసుకోవాలో అడగొచ్ఛు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని