close

తాజా వార్తలు

‘దేశంలోకి పాక్ విషవాయువులు వదులుతోంది’

భాజపా నేత సంచలన ఆరోపణలు

మేరఠ్‌(ఉత్తరప్రదేశ్): దిల్లీలో కాలుష్యానికి చైనా, పాకిస్థాన్‌లే కారణమంటూ ఉత్తర్‌ప్రదేశ్‌ భాజపా నేత వినీత్‌ అగర్వాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దిల్లీలోకి పాక్, చైనా దేశాలు విష వాయువులను వదిలి ఉంటాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. భారత్‌కు భయపడే పొరుగు దేశాలు ఈ దారుణానికి ఒడిగడుతున్నట్లు తాను భావిస్తున్నానన్నారు. దీనిపై కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌తో ప్రత్యక్షంగా తలపడలేకే ఆ దేశాలు ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నాయన్నారు. మరోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టడం, అమిత్‌ షా హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం లాంటి పరిణామాలు వారికి మింగుడుపడడం లేదన్నారు. 

ఈ సందర్భంగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పైనా వినీత్‌ విమర్శలు గుప్పించారు. పంజాబ్‌, హరియాణా రైతులు పంట వ్యర్థాలను దహనం చేయడం వల్లే కలుషిత వాయువులు వెలువడుతున్నాయనడం అర్థరహితం అన్నారు. రైతులు దేశానికి వెన్నెముకలాంటి వారని.. వారిని నిందించడం తగదన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.