close

తాజా వార్తలు

అర్జున్‌కు జోడీగా రకుల్‌

హైదరాబాద్‌: దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ విజయవంతంగా రాణిస్తున్న ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. హిందీలో ఆమె కొత్త ప్రాజెక్టు ఖరారైంది. వైవిధ్యమైన కథలతో అలరిస్తున్న బాలీవుడ్‌ కథానాయకుడు అర్జున్‌ కపూర్‌తో కలిసి ఆమె నటించబోతున్నారు. ఈ ప్రాజెక్టును బుధవారం అధికారికంగా ప్రకటించారు. కాశ్వీ నాయర్ దర్శకత్వం వహించబోతున్నారు. భూషణ్‌ కుమార్‌, మోనీషా అడ్వాణీ, మధు భోజ్వాణీ, నిఖిల్‌ అడ్వాణీ, జాన్‌ అబ్రహం నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెలలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఇంకా ఈ సినిమా టైటిల్‌ను ఖరారు చేయలేదు. ‘ఇది కొత్త ప్రయాణం. ప్రతి భారతీయుడు ఈ సినిమాకు కనెక్ట్‌ అవుతాడు’ అని ఈ సందర్భంగా రకుల్‌ ట్వీట్‌ చేశారు.

రకుల్‌ ప్రస్తుతం ‘భారతీయడు 2’ సినిమాలో నటిస్తున్నారు. కమల్‌ హాసన్‌ కథానాయకుడు. మరోపక్క ఆమె ఓ తమిళ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఆమె హిందీలో నటించిన ‘మార్జావాన్‌’ ఈ నెల 8న విడుదల కాబోతోంది. అర్జున్‌ కపూర్‌ తను నటించిన ‘పానిపత్‌’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.