close

తాజా వార్తలు

కొలువులో కలత లేకుండా!

పనిప్రదేశంలో చేసే చిన్నచిన్న   నిర్లక్ష్యాలు ఉద్యోగ జీవితంపై ప్రభావం చూపిస్తాయి. వాటిని దిద్దుకుంటే గెలుపు మీదే.
* ఉద్యోగజీవితంలో సమయపాలన అన్నింటికంటే ముఖ్యం. దాన్ని తేలిగ్గా తీసుకుంటే పై అధికారుల దృష్టిలో మీపై ప్రతికూల భావన కలుగుతుంది. దేన్నైనా సరే అనుకున్నదానికంటే ముందుగానే పూర్తి చేయడం మంచిది. కార్యాలయానికే కాదు, సమావేశాలకు సమయానికి హాజరవడానికీ... మీదైన ప్రణాళిక ఉండాలి.

* ఏ రోజు ఏం చేయాలనుకుంటున్నారో ముందే ప్రణాళిక రూపొందించుకోవడం మంచి ఉద్యోగుల లక్షణం. సరైన ప్రణాళిక ఉంటే ఏపనైనా అనుకున్నట్లుగా పూర్తిచేస్తారు. ఒత్తిడీ దరిచేరదు. ముఖ్యంగా ఉత్పాదకతపై ప్రభావం చూపే పనుల్ని వదిలేయడమే మంచిది.  
* కొందరు ప్రెజెంటేషన్లు, సమావేశాలకు సరిగ్గా సన్నద్ధం అవ్వరు. సమయానికి ఏదో పూర్తిచేస్తే చాలనుకుంటారు. ఈ నిర్లక్ష్యం పదోన్నతిపై ప్రభావం చూపుతుంది. వీటి కోసం ముందు నుంచే సిద్ధమవడం తప్పనిసరి. అప్పుడే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.