
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: బాలీవుడ్ కథానాయిక, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా వారి అభిమానులకు ఆసక్తిగానే ఉంటుంది. అటు విరాట్ వరుస టూర్లతో, ఇటు అనుష్క సినిమాలో తీరికలేకుండా గడుపుతుంటారు. బిజీ షెడ్యూల్లో ఏ కొంచెం విరామం దొరికినా ఇరువురు తమ సమయాన్ని ఎంతో ఆస్వాదిస్తారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుష్క శర్మ ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకుంది. భర్త విరాట్ కోహ్లీ దుస్తులను దొంగిలించి వేసుకుంటానని చెప్పుకొచ్చింది.
‘‘విరాట్ వార్డ్ రోబ్‌లో బోలెడన్ని దుస్తులు ఉంటాయి. వాటిలో నాకు నచ్చినవి తీసేసుకుంటా. ఎక్కువగా విరాట్ టీ-షర్టులను వాడేస్తా. కొన్నిసార్లు జాకెట్స్ కూడా వేసుకుంటాం. ఎందుకంటే అలా మావారి దుస్తులు నేను ధరించినప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది’’-అనుష్క శర్మ
ఇక ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పెళ్లి సందర్భంగా ధరించిన గులాబీ రంగు దుస్తులను కావాలని ఎంపిక చేసినవి కాదని తెలిపింది. రెండేళ్ల కిందట విరాట్‌తో తన పెళ్లి సందర్భంగా అనుష్క ధరించిన లెహంగా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విరుష్క జోడీ భూటాన్ పర్యటనలో ఉన్నారు. విరాట్ నవంబరు 5న తన పుట్టినరోజు వేడుకలను అనుష్కతో కలిసి జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా దిగిన వారు ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ఈ డెబిట్‌కార్డులను బ్లాక్ చేయనున్న ఎస్బీఐ..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
