
తాజా వార్తలు
ముంబయి: బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమార్తె జాన్వి కపూర్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. వివిధ సందర్భాల్లో కుటుంబంతో కలిసి బోనీ దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ.. భావోద్వేగానికి గురయ్యారు. ‘హ్యాపీ బర్త్‌డే నాన్నా. నాకు ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందని ఎప్పుడూ నువ్వు నన్ను అడుగుతుంటావ్. అది నీ నుంచి వచ్చిందే. మనసుకు నచ్చిన పనులు చేస్తూ ఎలా ముందుకు వెళ్లాలో నిన్ను చూసే నేర్చుకున్నా. కిందపడ్డ ప్రతిసారీ మరింత దృఢంగా మారి ఎలా పైకి లేయాలో తెలుసుకున్నా. నువ్వు నాకు తెలిసిన ఉత్తమ వ్యక్తివి. నువ్వు నన్ను ఎంతో ప్రోత్సహించావు, స్ఫూర్తినిచ్చావు. నువ్వు ఎప్పుడూ నాకు బెస్ట్ నాన్నవి.. కానీ ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్‌వి. ఐ లవ్యూ. నువ్వు గర్వపడేలా నేను ప్రవర్తిస్తా’ అని జాన్వి పోస్ట్ చేశారు.
జాన్వి ప్రస్తుతం పంకజ్ త్రిపాఠి తెరకెక్కిస్తున్న ‘గుంజాన్ సక్సేనా’ సినిమాతో బిజీగా ఉన్నారు. 1999 కార్గిల్ యుద్ధంలో గాయపడ్డ సైనికుల్ని అత్యంత సాహసోపేతంగా సురక్షిత ప్రాంతాలకు తరలించిన భారత ఎయిర్ ఫోర్స్ మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా బయోపిక్ ఇది. మరోపక్క జాన్వి, కార్తిక్ ఆర్యన్ జంటగా ‘దోస్తానా 2’ సినిమా రూపుదిద్దుకుంటోంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- వదిలేశారు..
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
