
తాజా వార్తలు
ఆప్ నేత ప్రీతి శర్మ మేనన్
ముంబయి: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా కాంగ్రెస్ ఉపయోగించుకోవట్లేదని ఆమ్ ఆద్మీ పార్టీ మహారాష్ట్ర శాఖకు చెందిన నేత ప్రీతి శర్మ మేనన్ అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రను భాజపాకు కట్టబెడుతున్నారని వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ ఇదే తరహాలో వ్యవహరించిందని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు నిరాకరించి భాజపా గెలుపునకు బాటలు పరిచిందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఇక పార్టీ నిర్ణయాన్ని విస్మరించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శరద్ పవార్‌తో కలిసి నడవాలని ప్రీతి శర్మ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు ఇక కాలం చెల్లిందంటూ విమర్శలు గుప్పించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు కోసం కాంగ్రెస్, ఆప్ మధ్య చివరి క్షణం వరకు చర్చలు జరిగిన విషయం తెలిసిందే. చివరకు కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేసేందుకు నిర్ణయించుకుంది. దీంతో కాంగ్రెస్, ఆప్ ఒక్క సీటు కూడా గెలవలేక తీవ్ర పరాభవాన్ని మూటగట్టుకున్నాయి.
తాజాగా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై భాజపా వెనక్కి తగ్గడంతో అవకాశం శివసేనకు వచ్చింది. అయితే ఎన్సీపీతో కలిసి శివసేనకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ తర్జనభర్జలు పడింది. ఇక ప్రభుత్వ ఏర్పాటు చేసే అవకాశం ఎన్సీపీకి వచ్చినా మద్దతు విషయంలో కాంగ్రెస్ జాప్యం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆప్ విమర్శలు గుప్పించింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- నాకు సంబంధం ఉందని తేలితే ఉరేసుకుంటా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
