
తాజా వార్తలు
దిల్లీ: మహారాష్ట్రలో ఉత్కంఠ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్సీపీకి ఇచ్చిన నిర్దేశిత గడువు ఇంకా ముగియకపోవడం.. కాంగ్రెస్ పార్టీని కూడా ప్రభుత్వ ఏర్పాటుకు పిలవకుండానే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసిన గవర్నర్ బీఎస్ కోశ్యారీ వ్యవహార శైలిపై హస్తం నేతలు మండిపడుతున్నారు. ఆయన కేంద్ర ప్రభుత్వం ఒత్తిళ్లకు తలొగ్గి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆక్షేపించారు. దాదాపు మూడు వారాలుగా కొనసాగిన రాజకీయ ప్రతిష్టంభన నేపథ్యంలో రాజ్యాంగ విరుద్ధంగా, రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేసేలా వ్యవహరించారంటూ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా విమర్శించారు. బల నిరూపణకు అసెంబ్లీయే వేదిక అంటూ ఎస్.ఆర్.బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. మహారాష్ట్రలో ఏ ఒక్క పార్టీకీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ రాని నేపథ్యంలో గవర్నర్ నాలుగు రాజ్యాంగపరమైన ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆక్షేపించారు.
‘‘ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకొని ఎక్కువ స్థానాలు గెలుచుకున్న కూటమిని తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలి. ఉదా: 1. భాజపా-శివసేన కూటమి కలిసి బరిలోకి దిగింది గనక. 2. ఆ తర్వాత రెండో పెద్ద కూటమిగా ఆవిర్భవించిన ఎన్సీపీ- కాంగ్రెస్‌ను ఆహ్వానించాలి. 3. ఒక్కో పార్టీని విడివిడిగా పిలిచినట్టయితే.. కాంగ్రెస్‌ను ఎందుకు పిలవలేదు? 4. ప్రభుత్వ ఏర్పాటుకు సమయం కేటాయింపుల్లోనూ ఏకపక్షంగా ఎందుకు వ్యవహరించారు? భాజపాకు 48 గంటలు ఇచ్చారు. శివసేనకు 24గంటలు ఇచ్చారు. ఎన్సీపీకి అయితే 24గంటల సమయం కూడా ఇవ్వలేదు. అంతకముందే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. ఇది నిజాయతీ లేకుండా చేసిన రాజకీయ ప్రేరేపిత చర్య’ అని సూర్జేవాలా ట్విటర్లో విమర్శించారు.
ప్రధాని ఒత్తిడికి తలొగ్గారు: డిగ్గీ
మహారాష్ట్ర గవర్నర్ ప్రధాని నరేంద్ర మోదీ ఒత్తిడికి తలొగ్గారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. అందుకే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ‘‘తొలుత పెద్ద పార్టీగా అవతరించిన భాజపాను పిలిచారు. ఆ తర్వాత రెండు, మూడు పార్టీలను పిలిచారు. కానీ అకస్మాత్తుగా ఏం జరిగిందని రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు? కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితోనే ఇలా చేశారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించడంలేదు. రాష్ట్రంలో చెరిసగం పాలనా కాలంపై శివసేనతో ఎన్నికలముందు ఒప్పందం కుదుర్చుకున్నారనీ దీన్ని బట్టే అర్థమవుతోంది. శివసేనకు భాజపా ద్రోహం చేసింది’’ అని ఆరోపించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
