close

తాజా వార్తలు

తక్కువలోఎక్కువ ఫీచర్లు

మొబైల్‌ మాయ

ఫోన్‌ కొనే ముందు బడ్జెట్‌లో కొనాలి. సౌకర్యాలు మాత్రం భారీగా ఉండాలనుకుంటాం.. అలాంటి వారికే ఈ ఫీచర్‌ ఫోన్‌లు. ఓ లుక్కేయండి..

భారీ తెర
తక్కువ ధరలో తెర పరిమాణం ఎక్కువ ఉండాలనుకునేవారికే ఈ ఫోన్‌. ‘రియల్‌ మీ 5’. తాకే తెర పరిమాణం 6.5అంగుళాలు. గోరిల్లా గ్లాస్‌ సదుపాయం ఉంది. హెచ్‌డీ డిస్‌ప్లేలో వీడియోలు చూడొచ్ఛు నాలుగు కెమెరాల (12ఎంపీ+8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ) సదుపాయంతో ఆకట్టుకునేలా ఫొటోలు తీయొచ్ఛు సెల్ఫీ కెమెరా సామర్థ్యం 13ఎంపీ. దీంట్లో మరో ప్రత్యేకం బ్యాటరీ సామర్థ్యం. ఎంతో తెలుసా? 5000ఎంఏహెచ్‌. స్నాప్‌ డ్రాగన్‌ 665 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మూడు రకాల స్పెసిఫికేషన్స్‌తో ఫోన్‌ అందుబాటులో ఉంది.

* ధర: 3జీబీ+32జీబీ: రూ.8,999,

4జీబీ+64జీబీ: రూ.9,999,

4జీబీ+128జీబీ: రూ.10,999

కెమెరా అదిరింది

ఫొటోలు తీయడానికి కాస్త తక్కువ ధరలో మంచి కెమెరా ఫీచర్లున్న ఫోన్‌ కోసం ప్రయత్నిస్తున్నారా..! అయితే రెడ్‌ మీ నోట్‌ 8 స్మార్ట్‌ఫోన్‌పై ఓ లుక్కేయండి. వెనుక నాలుగు కెమెరాలు (48ఎంపీ+8ఎంపీ+ 2ఎంపీ+2ఎంపీ). 13ఎంపీ సెల్ఫీ కెమెరాతో తీసే ఫొటోలు అదుర్సే. తెర పరిమాణం 6.3 అంగుళాలు. బ్యాటరీ సామర్థ్యం 4000ఎంఏహెచ్‌. స్నాప్‌ డ్రాగన్‌ 665 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రెండు రకాల్లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది.

ధర: 4జీబీ+64జీబీ: రూ.9,999,

6జీబీ+128జీబీ: రూ. 12,999

సెల్ఫీ స్పెషలిస్ట్‌

మీరు సెల్ఫీ ప్రియులా? అయితే తక్కువ ధరలో మంచి కెమెరా సామర్థ్యం ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ని తీసుకోవాలంటే మోటరోలా జీ 8 ప్లస్‌ని ప్రయత్నించొచ్ఛు ముందు కెమెరా సామర్థ్యం 25ఎంపీ, వెనుక మూడు కెమెరాలు(48ఎంపీ+ 16ఎంపీ+ 5ఎంపీ) తెర పరిమాణం 6.3అంగుళాలు, బ్యాటరీ సామర్థ్యం 4000ఎంఏహెచ్‌. స్నాప్‌ డ్రాగన్‌ 665 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ధర: రూ. 13,999

(4జీబీ ర్యామ్‌+64జీబీ స్టోరేజీ)


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.