
తాజా వార్తలు
మన వంటింట్లో ఉండే పదార్థాల్లో అల్లం ఒకటి. ఈ కాలంలో దీన్ని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఎందుకో తెలుసుకోవాలనుకుంటున్నారా... ఇది చదవండి.
* అల్లంలో ‘జింజరోల్’ అనే శక్తిమంతమైన ఔషధగుణం ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ల బారి నుంచి శరీరాన్ని కాపాడుతుంది. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువ.
* ఈ కాలంలో అజీర్తి సమస్య వేధిస్తుంది. దాన్ని అదుపులో ఉంచాలంటే అల్లం వీలైనంత ఎక్కువగా తీసుకోవడమే పరిష్కారం. కుదిరితే రోజుకోసారి అల్లంచాయ్ తాగడం మంచిది. దానివల్ల కడుపు ఉబ్బరం, దగ్గు, జలుబు లాంటి సమస్యలూ అదుపులో ఉంటాయి. రెండు చెంచాల అల్లం తురుమును ఒకటిన్నర కప్పు నీటిలో వేసి మరిగించాలి. అల్లం సారం నీటిలోకి చేరి, మంచి వాసన వస్తున్నప్పుడు దింపేయాలి. ఇందులో కొద్దిగా తేనె, రెండు పూదీనా ఆకులు వేసుకుంటే చాలు.
* వ్యాయామం వల్ల వచ్చే కండరాల నొప్పులను తగ్గిస్తుందిది. రోజూ కొద్దిగా అల్లం తీసుకుంటే ఆ నొప్పులు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
* అల్లం తరచూ తీసుకునే వారిలో ఆస్టియోపొరోసిస్ వచ్చే ప్రమాదం చాలా తక్కువని వైద్యులు అంటున్నారు. ఆస్టియోపొరోసిస్తో బాధపడేవారు... అల్లం, దాల్చినచెక్క, నువ్వుల నూనె మిశ్రమాన్ని కీళ్లపై రాసి మృదువుగా మర్దన చేసుకుంటే నొప్పులు తగ్గి ఉపశమనం లభిస్తుంది.
* అల్లంలో శక్తిమంతమైన యాంటీ డయాబెటిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరస్థాయులను అదుపులో ఉంచుతాయి.
* నెలసరి సమయంలో వచ్చే నొప్పులు అదుపులో ఉండాలంటే... ఆ మూడు రోజులు పావుచెంచా చొప్పున అల్లం పొడిని నీటిలో కలిపి తీసుకోవాలి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- పసిపాప రియాక్షన్కు నెటిజన్లు ఫిదా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
