close

తాజా వార్తలు

నట్టింట్లో నిండుదనం...ఫెర్న్‌

బృందావనం

ఆకర్షణీయమైన ఆకులతో నట్టింటికి కళ తెచ్చేఇండోర్‌మొక్క ఫెర్న్‌. తక్కువ ఉష్ణోగ్రత, తేమ నేల, పరోక్ష కాంతి లభిస్తే ఎంతో అందంగా పెరుగుతుంది.

వాతావరణంలోనైనా పెరుగుతుందీ మొక్క. గాలిలో 40 నుంచి 50 శాతం తేమ ఉంటే ఆరోగ్యంగా ఎదుగుతుంది. అంతకన్నా తక్కువగా ఉంటే దీన్ని పెంచేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రేలు లేదా సాసర్‌లను రాళ్లు, నీటితో నింపి వాటిలో ఈ మొక్కల కుండీలను ఉంచాలి. గులకరాళ్లతోపాటు కొన్ని బొగ్గు ముక్కలు ఉంచితే అవి నీటిని శుద్ధిచేస్తాయి. దుర్వాసననూ పోగొడతాయి. మూడు నెలలకోసారి గులకరాళ్లు మారిస్తే ఆల్గే(నాచు) చేరకుండా ఉంటుంది.

సూర్యరశ్మి పడకుండా... సిరామిక్‌ కుండీలు, ఆకర్షణీయమైన పాత్రల్లో ఫెర్న్‌ను పెంచేటప్పుడు వాటికి మురుగునీరు పోయే సౌకర్యం ఉండదు. అలాంటప్పుడు మట్టి కుండీల్లో పెంచి తరువాత నేరుగా ఆ పాత్రల్లో ఉంచాలి. రెండు పాత్రల మధ్య ఒక స్పాగ్నమ్‌ మాస్‌ను (నర్సరీల్లో దొరుకుతుంది) పెట్టి తరచూ తడిచేస్తుంటే కుండీల్లో మట్టి ఎండిపోదు. మొక్కలపై సూర్యరశ్మి నేరుగా పడకుండా చూసుకోవాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే... పరదాలు అడ్డుపెట్టాలి. వీటి వేర్లు లోతుగా కాకుండా, పైనే ఉంటాయి కాబట్టి లోతు తక్కువగా ఉన్న కుండీలనే ఎంచుకోవాలి. మొక్కలు పెరిగేకొద్దీ వాటికి సరిపోయే కుండీల్లోకి మార్చాలి.

నీరు అవసరం... ఫెర్న్‌ని ఒక కుండీ నుంచి మరొకదాంట్లోకి మార్చేటప్పుడు వేర్లు తెగిపోకుండా చూసుకోవాలి. ఈ మొక్కకు వాడే మట్టి మిశ్రమంలో ఇసుక, గులకరాళ్లు, బొగ్గు, పీట్‌మాస్‌, స్పాగ్నమ్‌ మాస్‌, పశువుల ఎరువు తప్పనిసరి. ఈ మిశ్రమం తగినంత తేమను అందిస్తుంది. పీట్‌మాస్‌, ఇసుక, ఎర్రమట్టి, సమపాళ్లలో కలిపి కొంత సున్నం జోడించాలి. ఫెర్న్‌కి ఎక్కువ మొత్తంలో నీరు అవసరం. కనీసం వారానికొకసారైనా నీటిని అందించాలి. లేదంటే ఫెర్న్‌ ఉన్న కుండీలను నీటిలో ముంచి బుడగలు రాగానే ఇవతలకు తీసి యథాస్థానంలో పెట్టాలి. ఆకులు రాలిపోతుంటే ఎక్కువగా లేదా తక్కువ నీటిని అందిస్తున్నట్లు అర్థం. శిలీంధ్రాలు ఆశించకుండా ఎండిపోయిన ఆకులు, మట్టలను ఎప్పటికప్పుడు తొలగించాలి. పొలుసు పురుగులు ఆశిస్తే వేపనూనె పిచికారి చేయాలి. వేర్లతో ఉన్న కొమ్మలు లేదా ముదిరిన తల్లి కొమ్మల వెనుకభాగంలో తయారయ్యే బీజాల(స్పోర్స్‌)తో ఫెర్న్‌ని ప్రవర్థనం చేయొచ్ఛు


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.