
తాజా వార్తలు
వీడియోలు చూశారా!
ముంబయి: చిన్నపిల్లాడి నుంచి వయసుపైబడిన వారి వరకూ అందర్నీ ఉర్రూతలూగిస్తున్న మాధ్యమం టిక్‌టాక్. దీనికి బాలీవుడ్ సెలబ్రిటీలేమీ అతీతులు కాలేదు. బాలీవుడ్ స్టార్స్ మాధురీ దీక్షిత్, షాహిద్ కపూర్, సన్నీ లియోని, రితేష్ దేశ్‌ముఖ్ తదితరులు టిక్‌టాక్ వేదికగా అభిమానులకు మరింత చేరువగా ఉంటున్నారు. డైలాగ్‌లకు లిప్‌సింక్ చూస్తూ, పాటలకు డ్యాన్స్ చేస్తూ అభిమానులకు వినోదం పంచుతున్నారు.
మాధురీ దీక్షిత్
బాలీవుడ్ తార మాధురీ దీక్షిత్ ఇటీవల టిక్‌టాక్‌లో చేరారు. ఆమె ఖాతా ప్రారంభించిన కొన్ని రోజులే అవుతున్నా.. అప్పుడే 8 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆమె ప్రొఫైల్‌ను 1.7 మిలియన్ల మంది లైక్ చేశారు. ఇప్పటి వరకు ఆమె కేవలం రెండు వీడియోలు మాత్రమే షేర్ చేశారు. ఆ రెండింటినీ 10 మిలియన్ల మందికిపైగా వీక్షించడం విశేషం. ఆమె బ్లాక్ జీన్స్‌లో ‘ఏక్ దో తీన్..’ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను టిక్‌టాక్‌లో షేర్ చేశారు. ఆమె స్టెప్పులు ఫాలోవర్స్‌ను ఆకట్టుకున్నాయి.
షాహిద్ కపూర్
హీరో షాహిద్ కపూర్ టిక్‌టాక్‌లో ఇప్పటి వరకు ఆరు టిక్‌టాక్ వీడియోలను షేర్ చేశారు. ఆయన్ను 6.2 లక్షల మంది ఫాలో అవుతున్నారు. 8 లక్షల మంది ఆయన ప్రొఫైల్‌ను లైక్ చేశారు. నటి యామీ గౌతమ్‌తో కలిసి చేసిన టిక్‌టాక్ వీడియోను తాజాగా షాహిద్ షేర్ చేశారు. దీనిలో వారు సినిమా డైలాగ్ చెబుతూ కనిపించారు.
సన్నీ లియోని
అందాల భామ సన్నీ లియోనిని టిక్‌టాక్‌లో 1.4 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ఆమె ప్రొఫైల్‌ను 5.9 మిలియన్ల మంది లైక్ చేశారు. సన్నీ మిలిగిన స్టార్స్‌తో పోల్చితే టిక్‌టాక్‌లో చాలా చురుకుగా ఉంటున్నారు. తరచూ వీడియోలను షేర్ చేస్తున్నారు. అవి ఫాలోవర్స్‌ను అలరిస్తున్నాయి.
రితేష్ దేశ్‌ముఖ్
కథానాయకుడు రితేష్ దేశ్‌ముఖ్ అందరు స్టార్స్‌కన్నా అత్యధిక వీడియోలను టిక్‌టాక్‌లో పంచుకున్నారు. దాదాపు 30 వీడియోలతో 6 మిలియన్ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నారు. ఆయన ప్రొఫైల్‌ను 42.8 మిలియన్ల మంది లైక్ చేయడం విశేషం. సతీమణి జెనీలియా, ఇద్దరు పిల్లలతో కలిసి తీసుకున్న వీడియోలు, సహనటులతో కలిసి తీసుకున్న వీడియోలను ఆయన షేర్ చేస్తూ ఉంటారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- జయలలితగా రమ్యకృష్ణను చూశారా?
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- ‘అతను నన్ను చంపాలని చూస్తున్నాడు’
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- భయం.. కోపం రెండూ వస్తున్నాయి!
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- అలాంటివాటిపై దృష్టి సారిస్తే నష్టమే:మమత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
