close

తాజా వార్తలు

గూగుల్‌ యాప్స్ లేకుండానే హువావే ఫోన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ హువావేపై అమెరికా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తర్వాత ఆ ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది. ఈ నేపథ్యంలో గూగుల్‌ యాప్స్‌ లేకుండానే హువావే తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ మేట్‌ ఎక్స్‌ను విక్రయానికి తీసుకొచ్చింది. హువావే నుంచి వస్తున్న తొలి ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇదే కావడం గమనార్హం.

మేట్‌ ఎక్స్‌ 8 అంగుళాలు (అన్‌ఫోల్డ్‌) ఫోల్డబుల్‌ డిస్‌ప్లేతో రానుంది. దీని ధరను 16,999 యువాన్లు (2,422డాలర్లు)గా నిర్ణయించారు. శాంసంగ్‌ గెలాక్సీ ఫోల్డ్‌కు పోటీగా దీన్ని తీసుకొచ్చారు. భద్రత కారణాల దృష్ట్యా హువావేపై అమెరికాలో నిషేధం ఉండటంతో గూగుల్‌ యాప్స్‌ లేకుండా హువావే ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. దీనిలో క్వాల్కమ్‌కు బదులుగా కిరిన్‌ 980 ప్రాసెసర్‌ను వాడారు. 8జీబీ ర్యామ్‌, 512 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీతో వస్తోంది. ఆండ్రాయిడ్‌తో పాటు, ఈఎంయూఐ9తో పనిచేసే ఈ ఫోన్‌లో కేవలం చైనాకు చెందిన యాప్స్‌ మాత్రమే ఉంటాయి. గూగుల్‌ మ్యూజిక్‌ సహా ఇతర ఏ యాప్స్‌ ఇందులో ఉండవు. మరి వినియోగదారుల నుంచి దీనికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. అమెరికాలో హువావే ఉత్పత్తులను విక్రయించుకోవచ్చని అధికారులు వెల్లడించినా, ఇంకా అనుమతులు లభించకపోవడంతో ఎదురు చూపులు తప్పడం లేదు. ప్రస్తుతం చైనాలో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను త్వరలోనే ఇతర దేశాల్లోనూ విక్రయించాలని హువావే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.