
తాజా వార్తలు
పాదాలు అందంగా, మనం ఆరోగ్యంగా ఉండాలంటే... ఏం చేయాలో తెలుసా... పాదాలకు మర్దన. అదెలా అంటారా... ఇది చదవండి. మీకే తెలుస్తుంది.
* పాదాలకు మర్దన చేస్తే శరీరమంతా రక్తప్రసరణ జరుగుతుంది. దీంతో అలసట, నిస్తేజం వంటివి దూరమవుతాయి.
* ఈ మర్దనతో నాడీవ్యవస్థ చురుగ్గా మారి... ఒత్తిడి, ఆందోళన వంటివి అదుపులో ఉంటాయి. పాదాలకు మసాజ్ వల్ల కండరాలకూ విశ్రాంతి లభిస్తుంది. దాంతో మోకాళ్లు, కాళ్ల నొప్పులు మాయమవుతాయి. కీళ్లూ దృఢంగా మారి... ఒళ్లు నొప్పులున్నా తగ్గుతాయి.
* అధికరక్తపోటు నియంత్రణలో ఉంటుంది. నిద్రలేమి, మగతగా అనిపించడం వంటివీ పోతాయి.
* జీవక్రియల పనితీరూ చురుగ్గా మారుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి.
* కాళ్లవాపూ, కాళ్లల్లో నీరు చేరడం వంటివీ తగ్గుతాయి.
మర్దన ఎలా చేసుకోవాలంటే...
టబ్బులో సగంవరకూ గోరువెచ్చటి నీరు తీసుకోవాలి. అందులో అయిదారు చుక్కల ఆవ లేదా కొబ్బరి నూనె వేయాలి. పాదాలను పది నిమిషాలు ఆ నీటిలో ఉంచి... తరువాత మెత్తటి తువాలుతో తుడుచుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చటి కొబ్బరినూనెతో పాదాలను మర్దన చేసుకోవాలి. పది, పదిహేను నిమిషాలు పాదాలకు మర్దన చేసుకుంటే చాలు. ఇందుకోసం పుదీనా, లవంగం, యూకలిప్టస్, ఆలివ్... ఇలా ఏ నూనెనైనా ఎంచుకోవచ్చు.