
తాజా వార్తలు
ఈ కాలంలో చర్మం త్వరగా పొడిబారుతుంది. నిర్జీవంగానూ కనిపిస్తుంది. ఈ సమయంలో మేకప్ చేసుకోవాలనుకుంటే... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా...
మాస్క్ తప్పనిసరి: కొద్దిగా మేకప్ వేసుకున్నా... ముఖం తాజాగా కనిపించాలంటే చర్మం బాగుండాలి. వారానికోసారి చర్మాన్ని మృదువుగా మార్చే మాస్క్ వేసుకోండి. అదీ రాత్రిపూట. తేనె, పెరుగు, ఓట్స్‌పొడి సమపాళ్లలో తీసుకుని అన్నింటినీ కలిపి ముఖానికి రాసుకుని, మర్దన చేయాలి. పావుగంట తరువాత కడిగేయాలి. పెరుగు చర్మాన్ని శుభ్రపరిచి, తేమనందిస్తే... తేనె చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఓట్స్ మృతకణాలను తొలగించి, పొడిబారే సమస్యను తగ్గిస్తాయి. లేదంటే... కాఫీతోనూ మాస్క్ వేసుకోవచ్చు. కాఫీపొడి, చాక్లెట్, తేనె సమపాళ్లలో తీసుకుని కలపాలి. పొడిబారే సమస్యను తగ్గించడంతోపాటు చర్మాన్ని మెరిపిస్తుందీ పూత. అన్నిరకాల చర్మతత్వాలవారూ ఈ పూతను ప్రయత్నించొచ్చు.
మాయిశ్చరైజర్ రాయండి: అలంకరణ చేసుకునే ముందు ముఖానికి మాయిశ్చరైజర్ తప్పనిసరి. ముఖం శుభ్రం చేసుకున్న వెంటనే నాణ్యమైన మాయిశ్చరైజర్‌ని చర్మానికి రాసుకుని మృదువుగా మర్దన చేయాలి. ఈ చిన్న జాగ్రత్త తీసుకోవడం వల్ల అలంకరణ చేసుకుని గంటలు గడిచినా చర్మం పొడిబారకుండా ఉంటుంది. కుదిరితే మాయిశ్చరైజర్ రాసుకోవడానికి ముందు... ముఖాన్ని శుభ్రం చేసుకున్న వెంటనే చిన్న ఐసుముక్కతో రుద్దుకుంటే... అలంకరణ ఎక్కువసేపు తాజాగా ఉంటుంది.
మ్యాటీ వద్దు: మిగిలిన కాలాలతో పోలిస్తే... ఈ సమయంలో ఫౌండేషన్ ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. మ్యాటీ రకాన్ని అసలు వాడకూడదు. కుదిరితే దీనిలో కొద్దిగా ప్రైమర్ కలిపి ముఖానికి రాసుకోండి. దీన్ని రుద్దినట్లు రాసుకుంటే చర్మం పొట్టులా రాలే అవకాశం ఉండొచ్చు. అక్కడక్కడా అద్దుకుని స్పాంజితో నెమ్మదిగా రాసుకుంటే చాలు. దీంతోపాటు కొద్దిగా సన్‌స్క్రీన్ వాడటమూ అవసరమే అంటారు నిపుణులు.
కళ్లు మెరిసేలా: ఈ కాలంలో కళ్లకు అలంకరణ అతిగా చేసుకోకపోవడమే మంచిది. కేవలం మస్కారా వేసుకుంటే సరిపోతుంది. తప్పదనుకున్నప్పుడు... సాయంత్రపు వేడుకలకు షిమ్మర్ ఐలైనర్‌ను వాడాలి.
లిప్‌స్టిక్ వాడేముందు: ఈ కాలంలో పెదాలు పొడిబారడం మామూలే. ఆ సమస్య ఎదురు కాకూడదంటే... పెదాలపై పేరుకున్న మృతకణాలు మొదట తొలగించుకోవాలి. టూత్‌బ్రష్‌పై కొద్దిగా చక్కెర అద్దుకుని పెదాలపై రుద్ది... కాసేపయ్యాక కడిగేయాలి. తరువాత క్రీం లిప్‌స్టిక్ వేసుకోండి. పెదాలు పొడిబారవు. ముదురుఎరుపు రంగు లిప్‌స్టిక్‌లు ఇప్పుడు సరైన ఎంపిక. ఒకవేళ రంగు వద్దనుకుంటే లిప్‌బామ్ అద్దుకుని... కొద్దిగా సన్‌స్క్రీన్‌లోషన్ రాసుకుంటే... పెదాలు పొడిబారినట్లు కనిపించవు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన
- మంత్రివర్గంలో వారికి చోటిస్తాం: యడియూరప్ప
ఎక్కువ మంది చదివినవి (Most Read)
