
తాజా వార్తలు
తల్లిదండ్రులు పాకెట్ మనీకోసం ఇచ్చిన డబ్బుల్లో ఎంతో కొంత పొదుపు చేసుకునే అలవాటే ఓ విద్యార్థినికి రాష్ట్ర స్థాయి అవార్డు తెచ్చిపెట్టింది. పొదుపుపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతగా నిలిచి కేంద్ర మంత్రి చేతులమీదుగా పురస్కారం అందుకుంది. ఆమే శ్రీకాకుళం జిల్లాకు చెందిన పొట్నాన ధనలక్ష్మి.
మాది పొందూరు మండలం రాపాక. రణస్థలంలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. నాన్న ఆదినారాయణ రైతు. అమ్మ వరలక్ష్మి గృహిణి. ప్రతి నెలా ఖర్చులకు కొంత డబ్బు ఇచ్చేవారు. దాంట్లో కొంత మొత్తం దాచుకునేదాన్ని. ఈ క్రమంలో ‘ముద్ర అగ్రికల్చరల్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ’ గత నెలలో ‘ప్రపంచ చూపు పొదుపు వైపు’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించింది. ఈ పోటీల్లో నా అనుభవాలను వివరిస్తూ... డబ్బు పొదుపు చేస్తే కలిగే లాభాలేంటో రాశా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కలిపి మొత్తం 304 ముద్రా బ్యాంకు విభాగాలున్నాయి. వాటి పరిధిలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో... ఆన్లైన్, ఆఫ్‌లైన్ పద్ధతిలో రాసే అవకాశం కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పది, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు 6,400 మంది హాజరయ్యారు. ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కో విభాగంలో ఒక్కొక్కరు చొప్పున ఏపీ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ముగ్గురు విజేతలను ఎంపిక చేసి పురస్కారాలు అందజేశారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవటం ఆనందంగా ఉంది. ఈనెల 14న దిల్లీలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ చేతుల మీదుగా నగదు బహుమతి, ప్రశంసా పత్రం అందుకున్నా.
- మీసాల సూరిబాబు, న్యూస్‌టుడే రాజాం
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- విచారణ ‘దిశ’గా...
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- కొడితే.. సిరీస్ పడాలి
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ‘దిశ’ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలు తరలింపు
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
