close

తాజా వార్తలు

Published : 27/11/2019 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టెకీ శాయికి గ్యాడ్జెట్ల లాలి

గ్యాడ్జెట్‌ గురూ

ఫిట్‌నెస్‌ కోసం అనేక రకాల గ్యాడ్జెట్‌లు వాడేస్తున్నాం..  మరి, హాయిగా నిద్రించేందుకు ఏవైనా గ్యాడ్జెట్‌ల సాయం తీసుకుంటున్నారా?  ఏంటీ.. సుఖనిద్రకి తగిన గ్యాడ్జెట్‌లు కూడా ఉన్నాయా! అనుకోవద్దు. ఒత్తిడికి విరుగుడు మంచి నిద్రేగా..   అందుకే టెక్నాలజీ ప్రియుల్ని ఆకట్టుకునేలా హాయి నిద్ర కోసం పలు రకాల గ్యాడ్జెట్‌లు మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. ఇవిగోండి కొన్ని..

 


గుర్‌..గుర్‌ర్‌!

గురక ఎంతో మందిని ఇబ్బంది పెడుతుంది. సమస్య ఉన్నవారికే కాదు. పక్కన నిద్రించే వారు గురకతో ఇబ్బంది పడతారు. కొన్నిసార్లు గురక వినలేక నిద్ర లేపేస్తుంటారు. మరైతే, దీనికి ఏంటి పరిష్కారం? ఇదిగో ఈ స్మార్ట్‌ దిండు మీ కోసమే. పేరు ‘మోషన్‌ పిల్లో 10మైండ్స్‌’. దీన్ని తలకింద  పెట్టుకుని పడుకుంటే చాలు. గురకని సహించదు. గుర్‌ర్‌ర్‌.. అని శబ్దం వినిపిస్తే చాలు. వెంటనే తలని సౌకర్యంగా మరో వైపు తిప్పుతుంది.  అంతేకాదు.. ప్రత్యేక సిస్టంతో నిద్రని మానిటర్‌ చేస్తుంది కూడా.


శ్వాసకి అనుగుణంగా..

నిద్రొస్తోందని పడుకుంటాం. నిమిషాలు గంటలైనా నిద్రపట్టదు. అటూ ఇటూ కదులుతూనే ఉంటాం. ఎప్పటికో నిద్ర పడుతుంది. ఉదయం నిద్రలేమితో బద్దకంగా అనిపిస్తుంది. మరి, అలా పడుకోగానే ఇలా నిద్రలోకి జారుకోవాలంటే? మీ శ్వాసలయతో జతకట్టే ఈ గ్యాడ్జెట్‌ని పక్కనే పెట్టేయండి. పేరు ‘డోడౌ’. నిద్రపోయే ముందు దీన్ని ఒకసారి తాకితే చాలు. మీ శ్వాసకి అనుగుణంగా పరికరంలో ఏర్పాటు చేసిన బ్లూ లైట్‌ వెలుగుతుంది. దీంతో మీకు తెలియకుండానే త్వరగా నిద్రలోకి జారుకుంటారు.

 


కళ్లకు హాయి...

ఇప్పుడంతా డిజిటల్‌ జమానా నడుస్తోంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ కంప్యూటర్‌, స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌లను చూస్తూనే ఉంటాం. దీంతో కళ్లు ఎక్కువ ఒత్తిడికి లోనవుతాయి. ఉపశమనం కోసం కళ్లకు నులివెచ్చని వేడి తగిలేలా చేస్తే ఎంతో హాయిగా అనిపిస్తుంది. అందుకే ఈ గ్యాడ్జెట్‌. చిత్రంలో మాదిరిగా దీన్ని కళ్లకు ధరిస్తే చాలు. ప్రత్యేక టెక్నాలజీతో రెండు కళ్లకు హాయిగా అనిపించేంత వేడిని పుట్టించి రిలాక్స్‌ అయ్యేలా చేస్తాయి. ఆటోమేటిక్‌గా ఆఫ్‌ అవుతాయి కూడా. ‘యూమే’ పేరుతో దీన్ని పిలుస్తున్నారు.


గదిలోకి స్మార్ట్‌ సూరీడు

కాంక్రీట్‌ జంగిల్లో ఎప్పుడు రాత్రి అవుతుందో.. ఎప్పుడు తెల్లారుతుందో తెలుసుకోవడం కొందరికి కష్టమే. ఎప్పుడో రాత్రి ఇంటికొచ్చి పడుకుంటే పొద్దునే అలారం మోగుతుందేగానీ.. గదిలో చీకటి మాత్రం అలానే ఉంటుంది. అందుకే.. నిద్ర లేచే సరికి గదిలోకి సూర్యకాంతి ప్రసరించినట్టుగా వెలుతురు వచ్చేలా చేయాలంటే? ‘ఫిలిప్స్‌ స్మార్ట్‌ స్లీప్‌ లైట్‌’ని పెట్టేయండి. ఇదో అలారమే కానీ.. దీంట్లో లైటు ఉంటుంది. అది అలారం మోగే సమయానికి సూర్యుడు ఉదయించినట్టుగానే  గదిలోకి వెలుతురు తీసుకొస్తుంది.  దీంట్లో వాతావరణ వివరాల్నీ చూడొచ్చు.


 


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని