close
వైట్‌హౌస్‌ ఎదుట సీపీఐ నారాయణ నిరసన

వాషింగ్టన్‌: కశ్మీర్‌కు న్యాయం చేయాలంటూ అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్‌ ఎదుట సీపీఐ కార్యదర్శి నారాయణ నిరసన గళం వినిపించారు. పలు అంతర్జాతీయ సమస్యలపై శ్వేతసౌధం ఎదుట స్థానికులు నిర్వహిస్తున్న ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచాన్ని ప్రభావితం చేయగల శ్వేతసౌధం ఎదుట నిరసన తెలిపే ప్రజాస్వామ్య హక్కు ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని విమర్శించారు. కనీసం 10 కిలోమీటర్ల దూరంలో నిరసనలు తెలిపినా అక్కడి ప్రభుత్వాలు నేరంగా పరిగణిస్తుండడం దుర్మార్గమన్నారు. ఇది ప్రజాస్వామ్య హక్కులు కాలరాయడమేనని తప్పుబట్టారు.

వార్తలు / కథనాలు

మరిన్ని