close
భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు

సింగపూర్: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ(వామ్‌) ఆధ్వర్యంలో సింగపూర్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వామ్‌ సభ్యుల సహకారంతో ఆగ్నేయాసియాలోనే ప్రథమంగా స్థానిక పాయాలేబర్‌ శివాలయంలో ఇక్షుమహాగణపతిని ప్రతిష్ఠించారు. అందంగా చెరుకు గెడలతో అలంకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సింగపూర్‌ విభాగం అధ్యక్షులు వల్లంకొండ విజయ్‌, కోశాధికారి శరత్‌బాబు, జూలూరి సంతోష్‌, కోట సతీష్‌, కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు. 

వార్తలు / కథనాలు

మరిన్ని