close
సామాజిక భద్రతపై ఐఏఎఫ్‌సీ కార్యశాల

డల్లాస్‌: అమెరికాలో స్థిరపడిన భారతీయుల కోసం అక్కడి ఇండియన్‌ అమెరికన్‌ ఫ్రెండ్‌షిప్‌ కౌన్సిల్‌ (ఐఏఎఫ్‌సీ) ‘సామాజిక భద్రత’పై కార్యశాల నిర్వహించింది. సెప్టెంబర్‌ 7న డల్లాస్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐఏఎఫ్‌సీ నిర్వహించిన ఈ కార్యక్రమానికి సామాజిక భద్రతా విభాగానికి చెందిన ప్రజా సంబంధాల నిపుణురాలు ఆంగీ హోక్వాంగ్‌ను ఆహ్వానించారు. వంద మందికిపైగా భారతీయ అమెరికన్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆమె అందరికీ సామాజిక భద్రత గురించి వివరించారు. అనంతరం వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఆమె సమాధానం ఇచ్చారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన మిచిగాన్‌ రాష్ట్ర ప్రతినిధి పద్మ కుప్ప మాట్లాడారు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఐఏఎఫ్‌సీ అధ్యక్షుడు డాక్టర్‌ తోటకూర ప్రసాద్‌ను అభినందించారు. అనంతరం ఆంగీ హోక్వాంగ్‌తో పాటు, కుప్ప పద్మలను ప్రసాద్‌ తోటకూర, ఉపాధ్యక్షుడు తయాబ్ కుందవాలా సన్మానించారు. ఆ తర్వాత పద్మ యూఎస్‌లోని అతి పెద్ద మహాత్మాగాంధీ విగ్రహాన్ని సందర్శించారు. ఆమె వెంట కమ్యూనిటీ నాయకుడు సుబ్బు జొన్నలగడ్డ తదితరులు ఉన్నారు.

వార్తలు / కథనాలు

మరిన్ని