close
భారతీయ విద్యార్థులకు బ్రిటన్‌ తీపి కబురు

బ్రిటన్‌లో చదువుకుంటే రెండేళ్లు వర్క్‌ పర్మిట్‌
చదువు పూర్తయ్యాక రెండేళ్లు  అక్కడే పనిచేయొచ్చు
వచ్చే ఏడాది నుంచి నూతన వీసా విధానం

లండన్‌: ఉన్నత చదువుల కోసం బ్రిటన్‌ వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులకు శుభవార్త! విదేశీ విద్యార్థులు తమ దేశంలో చదువు పూర్తిచేసుకున్నాక రెండేళ్లపాటు పనిచేసే వెసులుబాటు కల్పించనున్నట్లు బ్రిటన్‌ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఇందుకోసం రెండేళ్ల కాల వ్యవధితో కూడిన విద్యానంతర ఉపాధి వీసా విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అక్కడ విద్యానంతర ఉపాధి వీసా విధానం గతంలోనూ ఉండేది. 2012లో థెరెసా మే హోంమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని రద్దు చేశారు. అప్పటి నుంచి బ్రిటన్‌లో భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆ విధానాన్ని ఇప్పుడు పునరుద్ధరించడంతో భారతీయ విద్యార్థులకు ఎక్కువ మేలు చేకూరే అవకాశముందని.. వారు బ్రిటన్‌ విశ్వవిద్యాలయాల్లో చేరేందుకు అధికంగా ఆసక్తి చూపొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

వార్తలు / కథనాలు

మరిన్ని