close
డార్ట్‌ ఫోర్డ్‌లోకన్నుల పండువగా వినాయక చవితి


లండన్: యూకేలోని కెంట్‌ డార్ట్ ఫోర్డ్ నగరంలో 'ఫీనిక్స్ క్వార్టర్స్ రెసిడెంట్స్ కమ్యూనిటీ' ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు వినాయక చవితి వేడుకల్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మండపంలో గణనాథుడి విగ్రహాన్ని 5 రోజులపాటు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొజ్జ గణపయ్యకు సామూహిక మంగళ హారతులు ఇచ్చి.. పాటలు పాడుతూ భక్తులంతా ఎంతో కోలాహలంగా వాతావరణంలో ఈ వేడుకల్ని నిర్వహించారు.  ఈ నెల 2 నుంచి 7 వరకు మొత్తం ఐదు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకల్లో చిన్నా పెద్దా అంతా భక్తిశ్రద్ధలతో గణపతిని దర్శించుకున్నారు.  భారతీయ, తెలుగు వంటకాలతో విందు, ప్రసాదాన్ని మహిళలు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు ఆ మహిళలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. మండపానికి తరలివచ్చిన భక్తులంతా స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. ఈ నెల 7న నిమజ్జనం సందర్భంగా భక్తులంతా ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో స్వామి వారిని కీర్తిస్తూ కారులో ఊరేగింపు నిర్వహించారు. అ నంతరం సమీపంలోని ఓ నదిలో గణనాథుడి విగ్రహాన్ని గంగమ్మ ఒడికి చేర్చారు. ఈ పండుగను  కన్నుల పండువగా నిర్వహించుకున్నామని డార్ట్‌ ఫోర్డ్‌ ఫీనిక్స్‌ క్వార్టర్స్‌ రెసిడెంట్స్‌ కమ్యూనిటీ వాలంటీర్‌ కృష్ణ పవన్‌ చల్లా ఓ ప్రకటనలో తెలిపారు.

 

వార్తలు / కథనాలు

మరిన్ని