close
డిపెండెంట్‌ వీసాపై ఉండగా హెచ్‌1బీ పొందటం ఎలా?

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా వీసాలకు సంబంధించి వివిధ అంశాలపై ‘అమెరికాయానం’ పేరిట పాఠకుల నుంచి ‘ఈనాడు’ ఆహ్వానించిన ప్రశ్నలకు... హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ అధికారులు సమాధానాలిచ్చారు. అవి ఇలా ఉన్నాయి.

అమెరికాలో మాస్టర్స్‌ డిగ్రీ చేద్దామనుకుంటున్నాను. వీసా ఇంటర్వ్యూ సమయంలో ఎలాంటి ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉంది?

- సత్యదేవ్‌ చిగురుపాటి

ఎలాంటి వీసాకు దరఖాస్తు చేశారు, అందుకు సంబంధించిన అర్హతలు ఎంత మేరకు ఉన్నాయన్న అంశాలను కాన్సులర్‌ అధికారి స్థూలంగా పరిశీలిస్తారు. మీ చదువుకు సంబంధించిన మునుపటి, భవిష్యత్తు ప్రణాళికలను ఇంటర్వ్యూ అధికారితో చర్చించేందుకు సన్నద్ధంగా ఉండండి. మీ ప్రశ్నలకు సమాధానాల కోసం ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ వెబ్‌సైట్‌ https://educationusa.state.gov, యునైటెడ్‌ స్టేట్స్‌-ఇండియా ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌(యూఎస్‌ఐఈఎఫ్‌) వెబ్‌సైట్‌ https://www.usief.org.in  చూడండి. విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన సమాచారం కోసం ‌www.ustraveldocs.com/in ను పరిశీలించండి.

డిపెండెంట్‌ వీసాపై అమెరికా వెళ్తున్నాను. డిపెండెంట్‌ వీసాపై ఉండగా హెచ్‌1బీ వీసాను పొందటం ఎలా?

- సరితా నేమాని

హెచ్‌1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలంటే... ఉద్యోగం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికాలోని కంపెనీ యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) నుంచి  ఆమోదం పొందిన చెల్లుబాటు అయ్యే పిటిషన్‌ ఉండాలి. మరింత సమాచారం కోసం ‌www.uscis.gov ను చూడండి. ఆ పిటిషన్‌ వచ్చిన తర్వాత వీసా ప్రక్రియ కోసం ‌www.ustraveldocs.com/in పరిశీలించండి.

మా అమ్మాయి విద్యార్థి వీసాను నాలుగు సార్లు తిరస్కరించారు. దరఖాస్తు చేసుకున్న విశ్వవిద్యాలయం సాధారణమైనదంటూ కారణాలను పేర్కొన్నారు. మంచి విశ్వవిద్యాలయాలను గుర్తించటం ఎలా?

- ప్రకాష్‌ సీవీ

అమెరికాలో చదువుకోవాలనుకునే వారు ముందు ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ వెబ్‌సైట్‌ https://educationusa.state.gov, యునైటెడ్‌ స్టేట్స్‌-ఇండియా ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌(యూఎస్‌ఐఈఎఫ్‌) వెబ్‌సైట్‌ను https://www.usief.org.in  చూడండి. ఆసక్తిగల విద్యార్థుల కోసం యూఎస్‌ఐఈఎఫ్‌ వ్యక్తిగతంగా సమాచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. విద్యార్థి వీసా దరఖాస్తుకు కావాల్సిన సమాచారం కోసం www.ustraveldocs.com/in  పరిశీలించండి.

నా వీసా దరఖాస్తును మూడు సార్లు తిరస్కరించారు. డీఎస్‌-160లో నా  పూర్తి పేరు నమోదు అయింది. అపాయింటుమెంట్‌ లేఖలో పొడి అక్షరాల్లో నమోదు అయింది. వీసా తిరస్కారానికి ఇదేమైనా కారణమవుతుందా?

- ప్రసాద్‌ చిలుకూరు

వీసా కోసం దరఖాస్తు చేసేటప్పుడు డీఎస్‌-160, ఇతర పత్రాల్లో సమాచారం సక్రమంగా ఉందా? లేదా? అని చూసుకోవాలి. దరఖాస్తును పరిశీలించేందుకు కాన్సులర్‌ అధికారి చాలా అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. వీసాను తిరస్కరించే ముందు అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తారు. వ్యత్యాసాలకు సంబంధించి కాన్సులర్‌ అధికారి ప్రశ్నిస్తే చర్చించేందుకు సిద్ధంగా ఉండండి. సంబంధిత విభాగానికి దరఖాస్తుదారుడు అర్హుడా? కాదా? అన్నది నిర్ధారించే ముందుకు విద్యార్థి ప్రొఫైల్‌ను, అర్హతలను చూస్తారు. మరింత సమాచారం కోసం ‌www.ustraveldocs.com/in   చూడండి.

* వీసాలకు సంబంధించిన నిర్దిష్టమైనఅంశాలు, తిరస్కారాలపై సందేహాలను supportn-india@ustraveldocs.com కు ఈ-మెయిల్‌ చేేయండి.
* మరింత సమాచారం కోసం హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ వెబ్‌సైట్‌ 
http://hyderabad.usconsulate.gov ను సంప్రదించవచ్చు. 
* హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం అందించే వీసా తదితర సేవలకు సంబంధించిన ప్రశ్నలను 
usvisa@eenadu.net  కు పంపగలరు.

వార్తలు / కథనాలు

మరిన్ని