close
హ్యూస్టన్‌ ఎయిర్‌పోర్ట్‌ లో మోదీ ఏంచేశారంటే?

ఫిదా అవుతున్న నెటిజన్లు

హ్యూస్టన్‌: ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇందుకోసం శనివారం సాయంత్రం హ్యూస్టన్‌కు చేరుకున్న ఆయనకు అక్కడి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన విమానం దిగి నడిచి వస్తుండగా అక్కడున్న అధికారులు ఆయనకు ఆహ్వానం పలికారు. ఈ సమయంలో ఆయనకు పుష్పగుచ్ఛంను ఇచ్చారు. దీనిని ఆయన అందుకుంటున్న సమయంలో అందులోనుంచి ఒక పువ్వు రెడ్‌ కార్పెట్‌పై పడిపోయింది. వెంటనే దీన్ని గమనించిన ప్రధాని మోదీ కిందకు వంగి దాన్ని తీసుకుని పక్కనే ఉన్న సహాయకులకు అందజేశారు. ఈ సయయంలో తీసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధాని నిరాడంబరతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న ఘటనలే మనిషిలో ఔన్నత్యాన్ని చాటి చెబుతాయంటూ కామెంట్లు పెడుతున్నారు.

ప్రధాని మోదీ ఈ రోజు హ్యూస్టన్‌ వేదికగా జరిగే ‘హౌడీ-మోదీ’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మోదీతో పాటు ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా పాల్గొంటారు. అంతే కాకుండా అమెరికా ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అమెరికా వ్యాప్తంగా ఉన్న సుమారు 50వేల మంది ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.


వార్తలు / కథనాలు

మరిన్ని