close
హౌడీ మోదీలో కార్యక్రమంలో ‘ప్రత్యేక’అతిథి

జాతీయ గీతాన్ని ఆలపించనున్న దివ్యాంగుడు

హ్యూస్టన్‌: ప్రవాస భారతీయులందరికీ ఆదివారం పండగరోజనే చెప్పాలి. ‘హౌడీ మోదీ’ కార్యక్రమం కోసం వీరంతా ఓ చోట చేరనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లన్నీ చేశారు. ఈ వేడుకలో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా కార్యక్రమాన్ని పురస్కరించుకుని ‘జన గణ మన’ గీతాన్ని స్పార్ష్‌ అనే ప్రత్యేక ప్రతిభావంతుడు ఆలపించనున్నాడు. ఈ సందర్భంగా 16 ఏళ్ల స్పార్ష్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇతడు కూడా ప్రవాస భారతీయుడే. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇద్దరినీ కలవబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని వెల్లడించాడు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి ముందు స్పార్ష్‌ జాతీయ గీతాన్ని ఆలపించనున్నాడు. హ్యూస్టన్‌లోని ఎన్‌ఆర్జీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి సుమారు 50వేల మంది పాల్గొననున్నారు.

వార్తలు / కథనాలు

మరిన్ని