close
చమురు కంపెనీల సీఈవోలతో మోదీ భేటీ

ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందం

హ్యూస్టన్‌: వారం రోజుల పర్యటనలో భాగంగా మోదీ అమెరికాలో ఉన్నారు. ఈరోజు ఆయన ‘హౌడీ-మోదీ’ కార్యక్రమంలో పాల్గొనన్నారు. ఇందుకుగానూ ఆయన శనివారమే హ్యూస్టన్‌ చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఆదివారం ఉదయం 16 చమురు కంపెనీల సీఈవోలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంధన రంగానికి సంబంధించి ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. టెల్లూరియన్‌(అమెరికా)-పెట్రోనెట్‌(భారత్‌) మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఏడాదికి 5మిలియన్‌ టన్నుల సహజవాయువు కొనుగోలుకు ఎంవోయూ పచ్చజెండా ఊపింది. దీని గురించిన లావాదేవీలు 2020 మార్చి 31నాటికి తేలనున్నాయి. వీరితో సమావేశం ఫలవంతమైనట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. 

ఈ భేటీ అనంతరం ప్రధాని మోదీ హ్యూస్టన్‌లో ఉన్న సిక్కు వర్గానికి చెందిన ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. అక్కడ మోదీకి ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడాల్సిందిగా అక్కడి ప్రజలు కోరారు. మోదీ మరి కాసేపట్లో ‘హౌడీ-మోదీ’ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

 

 


వార్తలు / కథనాలు

మరిన్ని