close
ట్రంప్‌ ప్రసంగానికి మోదీ ఫిదా


హ్యూస్టన్‌: హ్యూస్టన్‌ వేదికగా సాగిన ‘హౌడీ-మోదీ’ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇందులో భాగంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రసంగం భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆకర్షించింది.  ప్రవాస భారతీయుల గురించి ట్రంప్‌ ప్రసంగించినప్పుడు మోదీ ఆనందంతో చప్పట్లు కొట్టారు. 
‘ఉగ్రవాద పీడ నుంచి భారతీయ అమెరికన్లను రక్షణ కల్పించేందుకు కట్టుబడి ఉన్నాం. భారత్‌- అమెరికా మధ్య అంతరిక్ష సంబంధాలు కూడా ఉన్నాయి. మన దేశాలకు రక్షణ కల్పించేందుకు మన మైత్రి బంధం ఇలాగే కొనసాగాలి.’ అని ట్రంప్‌ అనగానే ప్రధాని మోదీ గౌరవసూచికంగా పైకి లేచి చప్పట్లు కొట్టారు. వెంటనే మోదీ ‘థ్యాంక్యూ..థ్యాంక్యూ. మేం కూడా అందుకు కట్టుబడి ఉన్నాం’అని అన్నారు.టెక్సాస్‌ రాష్ట్రంలోని హ్యూస్టన్‌ ఎన్‌ఆర్జీ స్టేడియం వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 50 వేల మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. 

వార్తలు / కథనాలు

మరిన్ని