close
సెనెటర్‌ భార్యకు మోదీ క్షమాపణ.. ఎందుకంటే

హ్యూస్టన్‌: ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ సభకు హాజరైన సెనెటర్‌ జాన్‌ కార్నిన్‌ భార్య అసూయగా ఉండి ఉంటారని, అందుకు ఆమెకు క్షమాపణలు చెబుతున్నానని మోదీ అన్నారు. ఆదివారం జాన్‌ కార్నిన్‌ భార్య శాండీ పుట్టినరోజు. అలాంటి ప్రత్యేకమైన రోజున జాన్‌ తన భార్యతో సమయం గడపకుండా తనతో ఉండటంతో మోదీ ఆమెను క్షమాపణ కోరారు.

హౌడీ మోదీ కార్యక్రమానికి జాన్‌ కార్నిన్‌ భార్య కూడా హాజరయ్యారు. సభ అనంతరం శాండీతో మాట్లాడుతూ.. ‘మీకు నేను క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు మీ పుట్టినరోజు. కానీ మీ గొప్ప జీవిత భాగస్వామి నాతో ఉన్నారు. అందువల్ల సహజంగానే మీకు కాస్త అసూయగా ఉంటుంది’ అని మోదీ అన్నారు. అనంతరం జాన్‌ కార్నిన్‌ భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ మాట్లాడుతుండగా పక్కనే ఉన్న జాన్‌ కార్నిన్‌ చిరునవ్వులు చిందించారు. ఈ వీడియోను భారత ప్రధాన కార్యాలయం ట్విటర్‌ ద్వారా పంచుకుంది.  


వార్తలు / కథనాలు

మరిన్ని