close
ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ

హ్యూస్టన్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన నిన్న హ్యూస్టన్‌లో జరిగిన హౌదీ మోదీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంచనాలకు మించి ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలిపారు.

‘డియర్‌ డొనాల్డ్‌ ట్రంప్‌.. మీరు హౌదీ మోదీ కార్యక్రమానికి రావడం భారత్‌-అమెరికా బంధాన్ని ప్రస్ఫుటిస్తోంది. మొదటి నుంచి భారత్‌కు మీరు మంచి స్నేహితుడిగా ఉన్నారు. మీరు ఈ కార్యక్రమానికి రావడం భారత్‌ పట్ల మీకున్న గౌరవాన్ని ప్రతిబింబిస్తోంది’అని ట్వీట్‌ చేశారు. హ్యూస్టన్‌లోని ఎన్‌ఆర్జీ స్టేడియం వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 50 వేల మంది ప్రవాస భారతీయులు హాజరయ్యారు. అమెరికాలోని అత్యున్నత స్థాయి అధికారులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఈనెల 27 వరకు అమెరికాలోనే ఉంటారు. ట్రంప్‌-మోదీ మంగళవారం మరోసారి భేటీ అవుతారు.

వార్తలు / కథనాలు

మరిన్ని