
కువైట్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి చెందడం బాధాకరమని కువైట్ తెలుగుదేశం అధ్యక్షులు కుదరవల్లి సుధాకర్‌రావు అన్నారు. ఈ మేరకు సుధాకర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఫర్వానియాలోని దవాహి భవనంలో కోడెల సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోడెల మృతిని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. 2015లో కోడెల తొలిసారి కువైట్ పర్యటించిన సందర్భంగా ఇక్కడి ప్రవాసాంధ్రుల కష్టాలను భారత రాయబార అధికారుల దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషి మరవలేనిదని నేతలు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వాసు మగుళూరి, తలమంచి శ్రీనివాస్, ప్రశాంత్, పార్థసారథి, బాబు పోలారావు, ఉర్దూ కవి సాయీద్ నజర్, కొత్తపల్లి మోహన్, ఈశ్వర్ నాయుడు, నాగార్జున, శ్రీను బోయపాటి, కల్యాణ్, సుబ్బారెడ్డి, ముస్తాఖ్ ఖాన్, నాయనిపాటి విజయ్, గోపి, అర్షద్, నరసింహ నాయుడు తదితరులు పాల్గొన్నారు.