close
డాలస్‌లో మహాత్ముడికి ఎంపీ నివాళులు

డాలస్‌: అమెరికాలోని గాంధీ మెమోరియల్‌ను తెరాస రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌ సందర్శించి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా లింగయ్య మాట్లాడుతూ.. 18 ఎకరాల సువిశాలమైన స్థలంలో ఇంత భారీ విగ్రహాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించిన గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.ప్రసాద్ తోటకూర కృషిని ఆయన అభినందించారు. అహింసావాదంతో, శాంతియుతంగా గాంధీజీ భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారని కొనియాడారు. జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకొంటున్న తరుణంలో డాలస్‌లో ఉన్న ఈ గాంధీ విగ్రహాన్ని తాను సందర్శించి నివాళులర్పించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వల, బోర్డు సభ్యులు, దాతలు, ఇర్వింగ్ పట్టణ అధికారుల కృషిని పార్లమెంట్ సభ్యులు లింగయ్య యాదవ్  ప్రశంసించారు. ఈ పర్యటనలో లింగయ్య యాదవ్‌తో పాటు కొలబెర్రి సంస్థ వ్యవస్థాపకుడు ఆనంద్ దాసరి, డా.రమేష్ బండగొర్ల, బలరాం యాదవ్ కాసుల, నాగరాజు తాడిబోయిన, రామ్మోహన్ అమాస పాల్గొన్నారు.

వార్తలు / కథనాలు

మరిన్ని