close
సౌదీకి పోదాం..రియాద్‌ చూద్దాం చలో.. చలో

తొలిసారిగా పర్యాటక వీసాలు జారీ చేయనున్న సౌదీ అరేబియా

రియాద్‌: పర్యాటక రంగాన్ని పెంపొందించుకునే క్రమంలో భాగంగా సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నడూ లేని విధంగా పర్యాటక వీసాలు జారీ చేయనుంది. 2030కెల్లా దేశ పర్యాటక రంగం ద్వారా అధిక ఆదాయాన్ని అర్జించే కార్యక్రమంలో భాగంగా ఈ మేరకు సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల చమురు బావులపై జరిగిన దాడుల్లో ఆదేశ ఆదాయానికి తీవ్ర నష్టం వాటిల్లింది. దాన్ని పర్యాటకం ద్వారా భర్తీ చేసుకోనుంది. 

‘అంతర్జాతీయ పర్యాటకులకు వీసా జారీ చేయనుండటం సౌదీ అరేబియా చరిత్రలో చారిత్రక ఘట్టం. సౌదీలోని పర్యాటక ప్రాంతాలను చూసి కచ్చితంగా ఆశ్చర్యానికి గురవుతారు. ప్రకృతి అందాలు, యునెస్కో గుర్తించిన ఐదు వారసత్వ ప్రదేశాలు పర్యాటకులను కచ్చితంగా కనువిందు చేస్తాయి’ అని సౌదీ ఓ ప్రకటనలో వెల్లడించింది.  శనివారం నుంచి ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ప్రపంచ వ్యాప్తంగా 49 దేశాల పౌరులు ఇందుకు అర్హులు. విదేశీయుల డ్రెస్‌ కోడ్‌ విషయంలోనూ సౌదీ కఠిన నిబంధనలను సడలించింది.

వార్తలు / కథనాలు

మరిన్ని