close
టెక్సాస్‌లో సిక్కు అధికారి దారుణ హత్య

హ్యూస్టన్‌: అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో ఇండియన్‌ అమెరికన్‌ సిక్కు పోలీసు అధికారి సందీప్‌ దలీవాల్‌ దారుణ హత్యకు గురయ్యారు. జాత్యహంకారంతోనే ఓ దుండగుడు విచక్షణారహితంగా సందీప్‌ను హతమార్చినట్లు తెలుస్తోంది. ఈ హత్యను అక్కడి పోలీసు వర్గాలు తీవ్రంగా ఖండించాయి. ట్రాఫిక్‌ విధులు నిర్వర్తిస్తున్న సందీప్‌ ఓ కారును ఆపగా.. ఆగ్రహించిన అందులోని వ్యక్తి విచక్షణారహితంగా అతనిపై కాల్పులకు తెగబడ్డాడని సహోద్యోగి గోంజలెజ్ తెలిపారు. అనంతరం దుండగుడు పక్కనే ఉన్న షాపింగ్‌మాల్‌లోకి పారిపోయాడన్నారు. అయితే సందీప్‌ వద్ద ఉన్న డాష్‌క్యామ్‌లో హంతకుడి చిత్రం రికార్డయిందని దీని ఆధారంగా అతణ్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆ సమయంలో కారులో దుండగుడితో పాటు ఉన్న మరో మహిళను సైతం కస్టడీలోకి తీసుకున్నామని తెలిపారు.

సిక్కు మతాచారాలను అనుసరిస్తూ టెక్సాస్‌ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న తొలి ఉద్యోగి సందీప్‌ అని సహచరులు చెప్పారు. టర్బన్‌ ధరించి గడ్డంతో విధులు నిర్వహించేందుకు అతనికి ప్రభుత్వం అనుమతించిందని.. ప్రజల మధ్య సమైక్యతను పెంపొందించడంలో భాగంగానే ఇలాంటి చర్యలు చేపట్టారని వివరించారు. తన వర్గ గౌరవాన్ని కాపాడడం కోసం సందీప్‌ నిరంతరం తపించడేవాడన్నారు. హార్వే తుపాను సమయంలో సిక్కు స్వచ్ఛంద సంస్థలతో కలిసి సందీప్‌ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. 40ఏళ్ల వయసున్న సందీప్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

వార్తలు / కథనాలు

మరిన్ని